ముఖంలో బాగా ఎట్రాక్ట్ చేసే భాగాల్లో లిప్స్ ముందు వరుసలో ఉంటాయి.లిప్స్ పింక్ కలర్( Lips pink color ) లో మెరిసిపోతూ కనిపిస్తుంటే ముఖం మరింత అందంగా ఆకర్షణీయంగా మారుతుంది.
అందుకే పింక్ లిప్స్ కోసం మగువలు పడి చచ్చిపోతూ ఉంటారు.అయితే పింక్ లిప్స్ కోసం లిప్ స్టిక్స్ మీద ఆధార పడాల్సిన అవసరం లేదు.
సహజంగా కూడా పొందవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ లిప్ బామ్ చాలా బాగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు కప్పులు ఫ్రెష్ ఎర్ర గులాబీ రేకులు ( Red rose petals )మరియు ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని ఉడికించాలి.చిన్న మంటపై దాదాపు పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో రోజ్ వాటర్ ( Rose water )ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ రోజ్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్ వేసి మెల్ట్ అయ్యేంత వరకు కలిపి గంట పాటు పక్కన పెట్టుకోవాలి.తద్వారా మన లిప్ బామ్ అనేది సిద్ధం అవుతుంది.రోజూ ఉదయం మరియు నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న లిప్ బామ్ ను పెదాలకు అప్లై చేసుకోవాలి.
రోజుకు రెండుసార్లు ఈ హోమ్ మేడ్ లిప్ బామ్ ను వాడితే న్యాచురల్ పింక్ లిప్స్ మీ సొంతం అవుతాయి.పిగ్మెంటేషన్ ను తగ్గించి పెదాలను గులాబీ రంగులోకి మార్చడంలో ఈ లిప్ బామ్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే ఈ లిప్ బామ్ ను వాడటం వల్ల పెదాలు మృదువుగా మారతాయి.డ్రై అవ్వకుండా ఉంటాయి.కాంతివంతంగా మరియు అందంగా మెరిసిపోతాయి.