టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఒక సినిమా ఇంకా విడుదల కాకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశ్వంభర( viswambhara ).ఈ సినిమాకు వశిష్ట దశతత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.అని అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల అయ్యి ఉండేది.

కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు తేదీని వాయిదా వేసిన విషయం తెలిసిందే.కాగా సోషియో ఫాంటసీ జానర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి ( Vamsi Krishna Reddy, Pramod Uppalapati, Vikram Reddy )సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.కాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్.రామ రామ అంటూ ఈ పాట సాగుతోంది.రామజోగయ్య శాస్త్రి ( Ramajogayya Sastry )లిరిక్స్ అందించగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు.
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా రామ రామ అనే పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్.

కాగా శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాటకు శోభి మాస్టర్, లలిత మాస్టర్స్ కొరియోగ్రఫీ అందించారు.హనుమంతుడి మహిమాన్వితత్వం, రామునిపై భక్తి, ఆధ్యాత్మికత గురించి వివరించిన ఈ పాట ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోకి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఇదే.ఇకపోతేఈ చిత్రంలో త్రిషతో పాటు కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ మొత్తం ఐదుగురు కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు.