బాగా ఫాలోయింగ్ ఉన్న సినీ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందుల్లో పడక తప్పదు.ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.
లేదంటే నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు కూడా సున్నితమైన అంశాలపై మాట్లాడకపోవడానికి అదే కారణం.
నెటిజన్లు సినీ సెలబ్రిటీలు మాట్లాడే మాటలు మాత్రమే చూడరు.వీరు సెలబ్రిటీల అవతారాన్ని కూడా బీభత్సంగా ట్రోల్ చేస్తారు.
అంతేకాదు, వారి ప్రవర్తన కాస్త తప్పుగా అనిపించినా రెండో ఆలోచన లేకుండా కడిగిపారేస్తారు.అయితే రీసెంట్ టైమ్‌లో కొందరు సౌత్ స్టార్స్‌ని నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్ చేశారు.మరి ఆ యాక్టర్స్ ఎవరు?? ట్రోలింగ్ కి ఎందుకు బాధితులు అయ్యారో తెలుసుకుంటే.
1.మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబుకి గర్వం ఎక్కువ అని ఈ మధ్యకాలంలో నెటిజన్లు ఏకిపారేశారు.ఈ హీరో పట్ల తమకు గౌరవం పూర్తిగా పోయిందని కూడా కామెంట్లు చేశారు.వీటన్నిటికీ కారణం మహేష్ తనకు బాలీవుడ్/హిందీ సినిమాలు చేయడం ఇష్టం లేదని కరాఖండిగా చెప్పడమే!.
2.బన్నీ
బ్లూ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు ధరించి ఉన్న బన్నీ ఫోటో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.దీన్ని చూసి బాడీ షేమింగ్ చేయడం ప్రారంభించారు నెటిజన్లు.‘వడా పావ్’, ‘బూచోడు’ అంటూ దారుణమైన పేర్లతో చాలా చిల్లరగా వ్యాఖ్యలు చేశారు.
3.తారక్
అకారణంగా కూడా కొందరు హీరోలు ట్రోలింగ్ ఫేస్ చేస్తూ ఉంటారు.అలాంటి జాబితాలో తారక్ కూడా జాయిన్ అయిపోయారు.
ఎవరో అభిమాని తారక్ ఫేస్‌ను ఒక సిక్స్ ప్యాక్ బాడీకి అమర్చి.ఆ బాడీ ఎన్టీఆర్ దే అన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే ఇది క్లియర్‌గా ఫొటోషాప్ చేసిన పిక్చర్ అని తెలియడంతో నెటిజన్లు తమ ఆట ప్రారంభించారు.తారక్‌కి సిక్స్ ప్యాక్ నిజంగా ఉందా? కెరీర్ తొలినాళ్లలో ఆయనకి ఫ్యామిలీ ప్యాక్ ఉందని తెలుసు కానీ సిక్స్ ప్యాక్ ఉందనే విషయం తమకు తెలియలేదే అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.“ఫేక్ ఫొటోలు పెట్టకండి, రా బాబు!” అని ఇంకొందరు విమర్శించారు.“ఒక్క నెలలోనే తారక్‌కి సిక్స్ ప్యాక్స్ వచ్చాయా? అదేమన్నా క్రాష్ కోర్సా? అదేంటో మాక్కూడా చెప్పండి బాబూ” అని ఇంకొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు.
4.నివీన్ పౌలీ
2021లో విడుదలైన కనకం కామిని కలహం (Kanakam Kaamini Kalaham) అనే మూవీలో గ్రేస్ ఆంటోనీతో కలిసి స్క్రీన్ షేర్ నివీన్ పౌలీ.అయితే అతడు ఈ మూవీలో కాస్త బొద్దుగా కనిపించడంతో అతని కించపరిచేలా ట్రోల్ చేశారు నెటిజన్లు.ఈ మాలీవుడ్ యాక్టర్ ఒక్కరే కాదు గతంలో కూడా చాలా మంది తమ శరీరాకృతి వల్ల విమర్శల పాలయ్యారు.
5.సాయి పల్లవి
సాయిపల్లవి అత్యంత సున్నితమైన కశ్మీర్ పండితుల అంశంపై మాట్లాడి ట్రోలింగ్‌కి గురైంది.
ఈ ముద్దుగుమ్మ కశ్మీరీ పండిట్ల ఊచకోత, ఆవులను అక్రమంగా తరలించే ముస్లిం వ్యక్తుల చంపడం ఒకటే అన్నట్లుగా మాట్లాడింది.దీంతో హిందువులు ఆమెను తీవ్రంగా విమర్శించారు.దాంతో ఆమె క్షమాపణలు కూడా చెప్పింది.అలాగే తాను చెప్పదలుచుకున్న విషయం ఇదీ అని ఒక వివరణ ఇచ్చుకుంది.అయితే ఆమె మొదటగా చేసిన వ్యాఖ్యలను కొందరు సపోర్ట్ చేశారు.
6.సమంత
సమంత గతంలో తరచుగా ట్రోలింగ్ కి బాధితురాలు అయ్యేది.ఆ తర్వాత జాగ్రత్తగా ఉంటున్న సమంత మళ్లీ ఇటీవల ఒక కారణం వల్ల నెటిజనులకు టార్గెట్ గా మారింది.
ఈ అగ్రతార ఓ మద్యం బ్రాండ్‌కు అంబాసిడర్ గా ఉంది.అంతేకాదు సోషల్ మీడియా వేదికగా ఆ బ్రాండ్‌ను ప్రమోట్ చేసింది.దాంతో మద్యాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? ఇది తప్పు కాదా అని ఆమెకు లెక్చర్లు ఇవ్వటం మొదలు పెట్టారు నెటిజన్లు.