కర్ణాటకలోని హోసూరులో( Hosur ) జరిగిన ఈ దారుణ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.ఓ బాలికను ఓ వ్యక్తి బలవంతంగా లాక్కెళ్తుంటే, మరో వ్యక్తి, మహిళ అనుసరించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
తమిళనాడులోని తొట్టమంజు ప్రాంతానికి చెందిన తిమ్మతూరు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు ఇష్టం లేకుండానే పెళ్లి చేశారు.
ఆ బాలిక 7వ తరగతి వరకు చదువుకుంది.
ఆ తర్వాత చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది.మార్చి 3న బెంగళూరులో కర్ణాటకలోని( Karnataka ) కలికుట్టై గ్రామానికి చెందిన 29 ఏళ్ల మదేశ్‌తో( Madesh ) ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు.
పెళ్లయ్యాక ఆ అమ్మాయి తన పుట్టింటికి తిరిగి వచ్చింది.కానీ భర్త ఇంటికి వెళ్లడానికి మాత్రం తెగేసి చెప్పింది.
తనను ఇక్కడే ఉండనివ్వమని తల్లిదండ్రులు, బంధువులను వేడుకుంది.కానీ వాళ్లెవరూ ఆమె మాట వినలేదు.

మదేశ్, అతని 38 ఏళ్ల అన్న మల్లేష్, మల్లేష్ భార్య కలిసి అమ్మాయి ఇంటికి వచ్చారు.ఆమె ఎంత వద్దని వారించినా వినకుండా, బలవంతంగా ఈడ్చుకెళ్లారు.అక్కడున్న వాళ్లు ఈ భయానక దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.బాధితురాలి నానమ్మ డెంకణికోటెలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు వెంటనే స్పందించి మదేశ్, మల్లేష్, మల్లేష్ భార్యతో పాటు బాలిక తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు.

వీరిపై పోక్సో చట్టం (POCSO Act), బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.నేరం రుజువైతే వీరికి రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.ప్రస్తుతం ఆ బాలిక తన తాతయ్య, నానమ్మ దగ్గర ఉంటోంది.
చట్ట ప్రకారం అమ్మాయిలకు పెళ్లి వయసు 18 ఏళ్లు నిండినా, బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.ఒక్క కర్ణాటకలోనే 2023-24లో 180 బాల్య వివాహాలు జరిగినట్లు సమాచారం.
వీటిలో 105 వివాహాలను అధికారులు ఆపగలిగారు.మిగిలిన 75 కేసుల్లో పోలీసులు కేసులు నమోదు చేశారు.







