సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.అందులో రైల్వే గేటు( Railway Gate ) వేసినా సరే లెక్క చేయకుండా ఒక వ్యక్తి ఏకంగా తన బైక్‌ని( Bike ) భుజాన వేసుకొని మరీ దూకేశాడు.టైమ్ ఆదా చేసుకోవాలని చూసిన అతగాడు ప్రాణాలకే తెగించాడు.‘ఘర్ కే కలేష్’ అనే ఎక్స్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు.వీడియోలో మొదట రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉండటం కనిపిస్తుంది.వేగంగా దూసుకొచ్చే రైలు కోసం గేటు వేశారు.జనాలు, వాహనాలు అన్నీ వెయిట్ చేస్తున్నాయి.కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అస్సలు ఆగలేదు.
టక్కున తన బైక్‌ని భుజాల మీదకు ఎత్తుకున్నాడు.ఆపై రైల్వే ట్రాక్ దాటేయడానికి రెడీ అయిపోయాడు.

అక్కడ ఉన్న మిగతా జనం అంతా షాక్ అయిపోయారు.అతగాడి ధైర్యానికి బిత్తరపోయి చూస్తుండిపోయారు.అంత బరువు బైక్‌ని భుజాన వేసుకొని ట్రాక్ దాటుతుంటే గుండె గుభేలుమంది వాళ్లకి.ఈ వీడియో ఈ మధ్యనే వైరల్ అయింది.నెటిజన్లు మాత్రం అతగాడిని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు.‘ఇది చాలా డేంజరస్ స్టంట్. చనిపోయేవాడివి,’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘కాస్త ఓపిక పడితే గేటు తీసేస్తారు కదా? అంత తొందరెందుకు?’ అని ఇంకొకరు ఫైర్ అయ్యారు.రైల్వే శాఖ( Railway Department ) వాళ్లు కచ్చితంగా వీడి మీద యాక్షన్ తీసుకోవాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం లైట్ తీసుకున్నారు.‘అబ్బా, జిమ్‌కి బాగా వెళ్లేలా ఉన్నాడు,’ అని కామెంట్ చేశారు.‘అంత బరువు బైక్‌ని ఎలా మోశాడో?’ అని ఆశ్చర్యపోయారు.ఫిట్‌నెస్ ఫ్రీక్ అయి ఉంటాడని జోకులు పేల్చారు.
ఏది ఏమైనా కొందరికి నవ్వు తెప్పించినా, చాలామంది మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన పని అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నారు.







