సాధారణంగా చాలామంది కూడా ఎలాంటి భోజనం తిన్న తర్వాత అయినా కూడా పెరుగు( Curd ) కచ్చితంగా తింటారు.అలాగే పెరుగు లేనిదే ముద్ద దిగదు అన్న సామెత కూడా ఉంది.
ఆకులో ఎన్ని నాన్ వెజ్ లు, ఎన్ని వెరైటీలు ఉన్నా కానీ చివర్లో పెరుగు లేకుండా భోజనం పూర్తి అవ్వదు.అయితే పెరుగు తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
అదే విధంగా పెరుగును ఎక్కువగా తీసుకోవడం వలన కూడా చాలా సమస్యలు కూడా ఉన్నాయి.పెరుగును ఎక్కువగా తీసుకోవడం వలన సమస్యలు ఎదురవుతాయని చాలామందికి తెలిసి ఉండదు.
కాబట్టి పెరుగును ఎక్కువగా తినేస్తూ ఉంటారు. పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం వలన మాత్రం సమస్యలు ఉన్నాయి.

అయితే పెరుగుతో చేసుకునే మజ్జిగతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.పెరుగులో విటమిన్స్, మినరల్స్ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.పెరుగు తినడం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.పెరుగు తినడం వలన గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకోవచ్చు.ఇందులో ఉండే కొవ్వు హార్ట్ హెల్త్( Heart Health ) కి చాలా ఉపయోగపడుతుంది.అలాగే పెరుగు తినడం వలన ఎముకలు దంతాలు ( Teeth )కూడా బలంగా దృఢంగా మారుతాయి.
పెరుగులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వలన అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.ఇలా అయితే వెయిట్ లాస్ కూడా అవ్వవచ్చు.

పెరుగు తీసుకోవడం వలన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి.దీంతో ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు.అంతేకాకుండా పెరుగు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి.అలాగే కడుపులో మంట ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం( Constipation ) లాంటి సమస్యలు ఉన్న పెరుగు తినడం వలన తగ్గిపోతాయి.
పెరుగు తినడం వలన చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.పెరుగు తినడం వలన చర్మానికి మంచి గ్లో వస్తుంది.అయితే పెరుగు తినడంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు.