మనం నిత్యం వాడే ఆహారాల పదార్థాల్లో చింతపండు ముందు వరసలో ఉంటుంది.ముఖ్యంగా కూరల్లో, సాంబర్‌లో చింతపండును విరి విరిగా ఉపయోగిస్తుంటారు.
పుల్ల పుల్లగా ఉండే ఈ చింతపండు ఎలాంటి వంటకానికైనా చక్కటి రుచిని అందిస్తుంది.చింతపండులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి మనకు ఆరోగ్య పరంగానే కాకుండా సౌందర్య పరంగానూ ఎంతగానో ఉపయోగపడతాయి.
ముఖ్యంగా సౌందర్య పరంగా చూసుకుంటే.
చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో, ముఖంపై నల్ల మచ్చలు మరియు మొటిమలు తొలిగించడంలో, మృదువైన చర్మాన్ని అందించడంలో చింతపండు గ్రేట్‌గా సమాయపడుతుంది.మరి ఇంతకీ దీనిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చింతపండులోని గింజలు తీసేసి నీటిలో నానబెట్టుకోవాలి.నానిన చింతపండు నుంచి గుజ్జు తీసుకుని.
అందులో కొద్దిగా పసుపు, నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.
ఇరవై నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు తగ్గుముఖం పడతాయి.

రెండొవది.నీటిలో నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా పెరుగు మరియు రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.అర గంట పాటు వదిలేయాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయడం వల్ల ముడతలు పోయి.
ముఖం యవ్వనంగా కాంతివంతంగా మారుతుంది.
మూడోవది.
చింతపండును నీటిలో కాసేపు నానబెట్టి.ఆ తర్వాత గుజ్జు తీసుకోవాలి.
ఆ చింతపండు గుజ్జులో కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమానికి ముఖానికి పట్టించి.
ఆరిపోనివ్వాలి.అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.చర్మంపై మలినాలు పోయి అందంగా మారుతుంది.