కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టాలంటే..సింపుల్ టిప్స్

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే కంటి కింద నల్లటి వలయాలను సులభంగా తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాను తెలుసుకుందాం.ప్రతి ఒక్కరు జీవితంలో ఎదో ఒక సమయంలో కంటి కింద నల్లటి వలయాలతో బాధ పడుతూ ఉంటారు.

 How To Remove Dark Circles Naturally-TeluguStop.com

కంటి కింద నల్లటి వలయాలు రావటానికి సరైన నిద్ర లేకపోవటం,ఒత్తిడి ,కాలుష్యం,అనారోగ్యం వంటి కారణాలతో నల్లటి వలయాలు ఏర్పడతాయి.ఈ వలయాలను వదిలించుకోవడానికి రకరకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు.

అయితే అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి.అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి .అందువల్ల ఇప్పుడు చెప్పే చిట్కాను పాటించటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంటి కింద నల్లటి వలయాలను తొలగించుకోవచ్చు.ఈ చిట్కాకు కేవలం రెండు ఇంగ్రీడియన్స్ సరిపోతాయి.

ఈ చిట్కా గురించి తెలుసుకుంటే ఇంత సులువుగా కంటి కింద నల్లటి వలయాలను తొలగించుకోవచ్చా అని ఆశ్చర్యపోతారు.

గ్లిజరిన్
గ్లిజరిన్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది.

గ్లిజరిన్ జెల్ రూపంలో ఉంటుంది.ఇది జిడ్డు చర్మం,పొడి చర్మం ఇలా అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది.

అలాగే ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.గ్లిజరిన్ లో ఉండే లక్షణాలు కంటి కింద నల్లటి వలయాలను తగ్గించటంలో సహాయపడతాయి.

గ్లిజరిన్ చర్మ సౌదర్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

విటమిన్ E క్యాప్సిల్
విటమిన్ E క్యాప్సిల్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది.

విటమిన్ E క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి.చర్మంలో మృత కణాలను తొలగించి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.విటమిన్ E క్యాప్సిల్ నల్లటి వలయాలను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది.అలాగే చర్మ సంరక్షణలో బాగా హెల్ప్ చేస్తుంది.

ఒక స్పూన్ గ్లిజరిన్ లో విటమిన్ E క్యాప్సిల్ లోని ఆయిల్ వేసి బాగా కలపాలి.రెండు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి.ఈ మిశ్రమం బాగా కలిసాక కంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాత్రి సమయంలో రాయాలి.మరుసటి రోజు ఉదయం నార్మల్ వాటర్ తో శుభ్రం చేయాలి.

ఈ విధంగా ఒక వారం రోజుల పాటు చేస్తూ ఉంటే నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి.ఆ తేడాను చూసి మీరు చాల ఆశ్చర్యపోతారు.

నల్లటి వలయాలను ఎంత సులువుగా తగ్గించుకోవచ్చో చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ చిట్కాను పాటించి సులువుగా కంటి కింద నల్లటి వలయాలను తగ్గించుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube