మహేష్ అభిమానులను టెన్షన్ పెడుతున్న ఎన్టీఆర్ సెంటిమెంట్.. ఏమైందంటే?

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) గురించి ప్రత్యేకగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి.

 Mahesh Babu Role In Ssmb29 Details, Mahesh Babu, Ssmb 29, Tollywood, Ntr Sentime-TeluguStop.com

జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.అంతేకాకుండా ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

ఇకపోతే నెక్స్ట్ సినిమాలో మహేష్ బాబుతో( Mahesh Babu ) చేయబోతున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Ntr Rajamouli, Ntr, Rajamouli, Shakti, Ssmb, Tol

అయితే ఇటీవల మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగగా, రెండో షెడ్యూల్ ఒరిస్సాలో ప్రారంభమైంది.మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రూపొందుతోన్న SSMB 29 సినిమాలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) హీరోయిన్ కాగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు.మహేష్ తండ్రిగా నానా పటేకర్ నటిస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ఒక న్యూస్ ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ ని భయపెడుతోంది.SSMB 29 సినిమాలో మహేష్ పాత్ర పేరు రుద్ర( Rudra ) అని ప్రచారం జరుగుతోంది.

మహేష్ సినిమాల్లో ఆయన పోషించే పాత్రలు, ఆ పాత్రల పేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.

Telugu Mahesh Babu, Maheshbabu, Ntr Rajamouli, Ntr, Rajamouli, Shakti, Ssmb, Tol

పార్థు, పండుగాడు, అజయ్, సీతారామరాజు, రమణ ఇలా ఏ పాత్ర పోషించినా మహేష్ తన మార్క్ చూపించాడు.ఇప్పుడు రుద్ర పేరు కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉంది.అయినప్పటికీ మహేష్ అభిమానుల్లో చిన్న భయం కనిపిస్తోంది.

దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన శక్తి సినిమా( Shakti Movie ) అని చెప్పాలి.ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయగా అందులో ఒక పాత్ర పేరు రుద్ర.

మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పట్లో భారీ అంచనాలతో విడుదలై, డిజాస్టర్ గా నిలిచింది.అందుకే రుద్ర పేరుని కొందరు మహేష్ ఫ్యాన్స్ నెగటివ్ గా ఫీలవుతున్నారు.

అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం అక్కడుంది దర్శకధీరుడు రాజమౌళి అని, ఒకవేళ క్యారెక్టర్ నేమ్ నిజంగానే రుద్ర అయినా అసలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.అయినా సినిమాలో విషయం ఉండాలి కానీ, పేరుది ఏముందని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube