దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు మహేష్ బాబు ,రాజమౌళి ( Mahesh Babu, Rajamouli )కాంబినేషన్లో రాబోతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలుకాకముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తదుపరి సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేయబోతున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.అయితే ఇప్పటికే మహేష్ బాబుని లాక్ చేసిన జక్కన ఈ సినిమా షూటింగ్ ని ఇటీవల జనవరిలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

దీంతో వరుసగా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి.అందులో భాగంగానే తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర( Rudra ) అనే క్యారెక్టర్ లో నటించబోతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇకపోతే ఇటీవల హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో( aluminum factory ) 12 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది.ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా పాల్గొన్నట్లు సమాచారం.

అలాగే ఇటీవలే స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్( Actor Prithviraj Sukumaran ) ఈ సినిమాలో ఎంపికైనట్లు తెలుస్తోంది.తాజాగా ఎయిర్ పోర్టులో మహేష్ బాబు పృథ్వీరాజ్ ఫోటోలు వైరల్‌గా మారాయి.ఇందులో ఇరువురు స్టార్లు పోలీస్ అధికారులకు కరచాలనం చేస్తూ కనిపించారు.వీరిద్దరూ ఒడిశాలో SSMB29 మూవీ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి వార్త కూడా బయటకు రాలేదు.చివరకు ప్రియాంక చోప్రా సైతం ఇందులో నటిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆమె మదర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలాన్ని ఇచ్చాయి.
ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి టీం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.ఒడిశాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా అక్కడ మరో 15 రోజులు షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.