అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh )హీరోగా నటించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం( Sankrantiki vastunnam ).జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఇటీవల బుల్లితెరపై ప్రసారం అవ్వడంతో పాటు ప్రస్తుతం ఓటీటీలో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమాపై ప్రముఖ టాలీవుడ్ రచయిత గోపాలకృష్ణ ( Tollywood writer Gopalakrishna )మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
రామానాయుడు, త్రివిక్రమరావు, వడ్డే రమేశ్( Ramanaidu, Trivikrama Rao, Vadde Ramesh ) తదితర నిర్మాతలు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు నిర్మించేవారు.
అలా ఈతరం నిర్మాతల్లో దిల్ రాజు, శిరీష్ కనిపించారు.కథ, స్క్రీన్‌ప్లే తదితర అంశాల్లో దర్శకుడు అనిల్ రావిపూడిదే క్రెడిట్.ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వెంకటేశ్ ప్రయాణం సాగింది.ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోయేందుకు పరితపించేవారు.
ఐశ్వర్య రాజేశ్ సహజంగా నటించింది.కిడ్నాప్ అయిన ఒక ప్రముఖ వ్యాపార వేత్తను హీరో ఎలా కాపాడగలిగాడు? అన్నదే ఈ సినిమా కథా బీజం.ఇంత చిన్న పాయింట్ ను అద్భుతంగా తెరకెక్కించారు.చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు చేసి ఉంటే ఈ స్క్రీన్ ప్లే ఇలా ఉండదు.

వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టు అనిల్ రావిపూడి ( Anil Ravipudi )సెట్ చేశారు.వినోదాత్మకంగా సాగే ఈ కథలో ఉప కథలూ చెప్పారు.ఒకటి హీరో పెళ్లికి ముందు ప్రేమకథ, రెండోది ఉపాధ్యాయుడి స్టోరీ.ఇందులోని అడ్వెంచర్ వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్ ది కాదు.అందుకే వినోదాత్మకంగానే తీయాలని హీరో, దర్శకుడు నిర్ణయించుకుని ఉంటారు.శోభన్ బాబు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారు ఎలాంటి కథల్లో నటించేవారో ఇదీ అలాంటిదే.
వెంకటేశ్ కు లేడీస్ ఫాలోయింగ్ తో పాటు మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది.వెంకటేశ్ తనయుడిగా కనిపించిన బాలనటుడు కెమెరాతో కబడ్డీ ఆడుకున్నాడు.

చాలా రోజుల తర్వాత సాయి కుమార్ తన స్టైల్ డైలాగ్స్ చెప్పి అలరించాడు.జాతీయ జెండా గురించి తెలుసుకునేలా సినిమాలో ఒక సన్నివేశం సృష్టించడం అభినందనీయం.ఒక బాలుడు త్రివర్ణ పతాకాన్ని సరిచేయడమనే అంశాన్ని ఈ చిత్రంలో స్పృశించినందుకు దర్శకుడికి హ్యాట్సాఫ్.ఇంటర్వెల్ నూ కామెడీగా తీర్చిదిద్దారు.హీరో అనుకున్నది సాధించేశాడు అని అనుకునేలోపు కథను కాస్త పక్కకు పెట్టి, పది నిమిషాల ఫైట్ పెట్టారు.తన గురువు ఉద్యోగం ఆయనకు వచ్చేంతవరకూ కథానాయకుడి యాక్షన్ పూర్తి కాదు.
కట్టిపడేసే ఇలాంటి స్క్రీన్‌ప్లేతో కాకుండా సాధారణంగా ఈ కథను చెబుతూ వెళ్లి ఉంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేదా? ఎన్నో వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు జంధ్యాలను అనిల్ గుర్తు చేశాడు అని చెప్పుకొచ్చారు గోపాలకృష్ణ.







