1.వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధుల విడుదల
వైయస్సార్ మత్స్యకారు భరోసా పథకం కింద 5 వ విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన సభలో ఈ నిధులను విడుదల చేశారు.
2.లైకా ప్రొడక్షన్స్ పై ఈడి దాడులు
ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లేక ప్రొడక్షన్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేపట్టింది.
3.సిబిఐకి ఎంపీ అవినాష్ లేఖ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు సిబిఐ విచారణకు హాజరు కాలేనని లేఖ ద్వారా సిబిఐ అధికారులకు తెలిపారు.
4.విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన
వేతనాలు పెంచాలని కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు పరిపాలన భవనాన్ని ముట్టడించారు.
5.రోడ్డు ప్రమాదంలో టిడిపి మాజీ ఎమ్మెల్యేకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా మార్కాపురం టిడిపి ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి.
6.సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలు లో పెరిగిన సీట్లు
సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఈనెల 17 నుంచి సీట్ల సంఖ్య 530 నుంచి 1128 కి పెరగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
7.హైదరాబాద్ విజయవాడ మధ్య ఈ గరుడ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు
హైదరాబాద్ విజయవాడ మధ్య 50 ఎలక్ట్రిక్ ఏసి బస్సులను దశలవారీగా నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.ఈరోజు మియాపూర్ క్రాస్ రోడ్ సమీపంలోని పుష్పక్ పాయింట్ వద్ద తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ బస్సులను ప్రారంభిస్తారు.
8.అధికారులపై గవర్నర్ కు ఫిర్యాదు
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై తో జిహెచ్ఎంసి బిజెపి కార్పొరేటర్ల సమావేశం అయ్యారు.జలమండలి జిహెచ్ఎంసి అధికారులపై గవర్నర్ కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.
9.జీడిమెట్లలో చిరుత ఆనవాళ్లు
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్న వీడియో వైరల్ గా మారింది.
10.నేటి నుంచి దోస్త్ అడ్మిషన్స్
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో సీట్ల భర్తీ కి సంబంధించి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పటికే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
11.10 నెలల్లో 10 లక్షలు ఉద్యోగాలు : కిషన్ రెడ్డి
పది నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టే ప్రక్రియను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
12.చీకోటి ప్రవీణ్ కామెంట్స్
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన తనకు లేదని, ఈడి విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని చీకోటి ప్రవీణ్ అన్నారు.
13.నేను పార్టీ మారడం లేదు : రాజగోపాల్ రెడ్డి
బిజెపితోనే నా ప్రయాణమని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలో దిగుతానని పార్టీ మారే ఆలోచన తనకు లేదని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
14.సిపిఐ నారాయణ కామెంట్స్
మోడీ గడ్డం ఎంత పెరిగిందో గ్యాస్ ధర కూడా అంతే పెరిగిందని పెట్రోల్ డీజిల్ ధరలు బాగా పెరిగాయని, బిజెపి అండతో దేశంలో కుబేరులు నల్లధనాన్ని మార్చుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
15.నాకు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదు : షర్మిల
త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఏ పార్టీతోను పొత్తు అవసరం లేదని , తెలంగాణలో షర్మిల అంటే తెలియని వాళ్ళు లేరని, 44 సీట్లలో గెలవబోతున్నామని వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
16.బిజెపి, కాంగ్రెస్ పై గుత్తా విమర్శలు
బిజెపికి బుద్ధి లేదు, కాంగ్రెస్ కు కామన్సెన్స్ లేదని బీఆర్ఎస్ నేత, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
17.మూడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటన
ఈనెల 17 నుంచి 19 వరకు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల్లో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటిస్తారు.
18.పవన్ కళ్యాణ్ పై జగన్ విమర్శలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.పవన్ ప్యాకేజీ స్టార్ అంటూ జగన్ ఎద్దేవా చేశారు.
19.ఏపీ తెలంగాణలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఈరోజు అధిక ఉష్ణోగ్రతలతో పాటు , తీవ్ర వడగాలి ప్రభావం ఉంటుందని ఏపీ నివారణ సంస్థ వెల్లడించింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,750
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 61,910
.