టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ అనంతరం హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలాంటి వివాదాలలోకి వెళ్లకుండా కేవలం తన సినిమా తన ఫ్యామిలీ అంటూ మహేష్ పూర్తిగా ప్రైవేట్ లైఫ్ గడుపుతున్నారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు గురించి డైరెక్టర్ గీత కృష్ణ( Geetha Krishna ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

మహేష్ బాబు ఇండస్ట్రీలో ఒకే ఒక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని ఆ విషయం నమ్రతకు ( Namrata ) తెలిసి పెద్ద గొడవ జరిగిందని తెలిపారు.మరి మహేష్ బాబు ఎఫైర్ పెట్టుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష ( Trisha )అని కూడా ఈయన వెల్లడించారు.ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉండటమే కాకుండా ఇద్దరు కలిసి ఓసారి ముంబైకి వెళ్లడంతో ఆ విషయం తెలిసిన నమ్రత వీరిద్దరి మేటర్ కూడా ముంబైలోనే సెటిల్ చేశారు అంటూ గీతాకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మహేష్ బాబు త్రిష ఇద్దరు కలిసి రెండు సినిమాలలో నటించారు.త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అతడు సినిమాలో నటించారు అయితే ఈ సినిమా వెండితెరపై సక్సెస్ అందుకో లేకపోయినా బుల్లితెరపై మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.ఈ సినిమా తర్వాత సైనికుడు అనే సినిమాలో నటించారు.ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.ఇలా ఈ రెండు సినిమాల తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు కానీ ఇప్పుడు గీత కృష్ణ వీరిద్దరి ఎఫైర్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టడంతో మహేష్ అభిమానులు డైరెక్టర్ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







