టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Star hero Prabhas )ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో మెజారిటీ భాగం షూట్ పూర్తైన సినిమా ఏదనే ప్రశ్నకు ది రాజాసాబ్ సినిమా పేరు వినిపిస్తుంది.
వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల ఈ సినిమా ఆ తేదీకి విడుదలయ్యే అవకాశం అయితే లేదు.
ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని ప్యాచ్ వర్క్, ఒక ఫైట్ రీషూట్ ఉందని సమాచారం అందుతోంది.
ది రాజాసాబ్ సినిమా ఈ ఏడాది దసరా పండుగ కానుకగా విడుదలయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.ది రాజాసాబ్ సినిమా( The Rajasaab Movie ) 300 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
ది రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.ది రాజాసాబ్ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కనుండగా ప్రభాస్ ఈ జానర్ లో నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో తర్వాత సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి.

ది రాజాసాబ్ సినిమా పీపుల్స్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఈ బ్యానర్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమనే సంగతి తెలిసిందే.ది రాజాసాబ్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.ది రాజాసాబ్ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.







