మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ డ్రైఫ్రూట్స్( Dry fruits ) ఎంతగానో ఉపయోగపడతాయి.సమతుల్య ఆహారంలో డ్రైఫ్రూట్స్ అద్భుతమైన ఒక భాగం.
వీటిని తీసుకోవడం వలన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా లభిస్తాయి.అయితే అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో వేరుశనగ, బాదం రెండు కూడా మంచి ఎంపికలు అని చెప్పవచ్చు.
ఈ రెండు రుచికరమైనవి.అయితే పోషకాహాల విషయానికి వస్తే మాత్రం ఏది శక్తివంతమైనది? ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.వేరుశనగ అన్నది సాంకేతికంగా చిక్కుళ్ళు.( Legumes ) నిజమైన గింజలు కాదు.అయినప్పటికీ పోషకాల పరంగా వాటిని గింజల కిందే పరిగణిస్తారు.వేరుశనగలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది శాఖాహారులకి ఒక అద్భుతమైన ప్రోటీన్ మూలం.అంతేకాకుండా వీటిలో మానవ ఆరోగ్యానికి అవసరమైన, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కలిగి ఉంటాయి.అంతేకాకుండా వేరుశనగలు,( Peanuts ) మెనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి.ఇది గుండె ఆరోగ్యం, హృదయ సంబంధిత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.అంతేకాకుండా ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ ని ప్రోత్సహిస్తుంది.దీంతో బరువు తగ్గించడానికి సహాయపడుతుంది.
అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది.ఇందులో విటమిన్ బి30, విటమిన్ బి9, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి.

ఇక బాదంపప్పు విషయానికొస్తే.బాదంపప్పు( Almond ) పోషక పవర్ హౌస్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది.అంతేకాకుండా ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి.ఇది ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.అంతేకాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మద్దతు ఇస్తుంది.
ఇక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది.ఇందులో కూడా మెనో ఆన్ శ్యాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా లభిస్తాయి.
కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో కూడా సాయపడుతుంది.
కాబట్టి రెండు కూడా ఆరోగ్యానికి చాలా ఉత్తమమైన ఎంపిక.