నలుగురు వ్యక్తులు ఒక చోట కలిస్తే నలుగురు నాలుగు విధాలుగా కూర్చుని ఉంటారు.అది వారికి ఒక అలవాటుగా జరిగే ప్రక్రియ.
మరికొందరైతే అందరిలో కలిసాం కాబట్టి కొద్దిగా డిగ్నిటీగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.మరికొందరు తమ హుందాతనాన్ని నిరూపించడం కోసం కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు.
స్కూల్ లలో, కాలేజీలలో ఎక్కువ మంది విద్యార్థులు ఇలా కూర్చోవడం గమనించి ఉంటాము.అయితే ఈ పొజిషన్ లో కూర్చోవడం వల్ల అనేక సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు? ఇలా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం వల్ల ఎలాంటి హాని జరుగుతుందో?, ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ? ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా మన స్థాయిని పెంచుకోవడం కోసం లేదా మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా ఇలా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం సహజంగానే గమనిస్తూ ఉంటారు.అయితే ఇలా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ఈ పొజిషన్ లో కూర్చుని కనిపిస్తారు.
కాకపోతే అమ్మాయిలలో ఎక్కువ ఈ పొజిషన్లో కూర్చొని తమ హుందాతనాన్ని తెలియజేస్తుంటారు.
ఈ పొజిషన్లో కూర్చోవడం వల్ల హుందాతనం మాత్రమే కనిపిస్తుంది.
కానీ వారికి తెలియకుండా ఎన్నో సమస్యలు కూడా వస్తాయి.ఎక్కువసేపు ఇదే పొజిషన్లో కూర్చోవడం వల్ల కాలక్రమేణా అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది.
అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల, లోపల శిశువు తిరుగుటకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అందువల్ల ఈ భంగిమలో కూర్చోకపోవడం ఎంతో శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.
కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల రక్తం సరఫరా క్రమంగా తగ్గుతుంది.అందువల్ల నరాల లో అధిక ఒత్తిడి కలిగి నరాల లో అధిక రక్త పీడనం ఏర్పడుతుంది.
ఫలితంగా పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి.మరికొందరిలో కాళ్లకు రక్తం సరఫరా సరిగా జరగక మోకాళ్ళ నొప్పులు, కాలు మంటలు రావడం వంటివి సమస్యలతో బాధపడుతుంటారు.
ఇన్ని సమస్యలతో బాధపడుతూ… అంత హుందాగా కూర్చోవడం కన్నా.సరైన భంగిమలో కూర్చొని ఆరోగ్యంగా ఉండటం ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.