షుగర్ ఉందని టెన్షన్ పడకు మామా... ఉందిగా ప్రకృతి వైద్యం!

భరతభూమి ఎన్నో ఔషధాలకు నిలయం.మన పూర్వీకులు నాటు వైద్యం, మొక్కల నుంచి వచ్చే పసరు వంటి వాటినే వివిధ అనారోగ్య సమస్యలకు మంచి ఔషదాలుగా వాడేవారు.

 Don't Stress About Sugar There Is Natural Medicine, Nature Treatment, Health Ben-TeluguStop.com

ప్రస్తుతం ఇంగ్లీషు మందులు రాజ్యమేలుతున్నవేళ ప్రకృతి వైద్యం లేదా.ఆయుర్వేదం వైపు ఎక్కువ మంది ఆసక్తి చూపించడం లేదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.

అయితే నేటి ఇంగ్లీషు మందులతో స్వల్పకాలిక ఉపశమనం అయితే కలుగుతుంది గానీ, దీర్ఘకాలిక సమస్యలు అనేవి తీరవు.పైగా ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయి.

Telugu Diabetes, Benefits, Care, Nature, Suger-Telugu Health

ఈ నేపథ్యంలోనే షుగర్‌తో( sugar ) బాధపడే రోగుల కోసం.బాపట్ల జిల్లా కేంద్రంలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ జి.కె మూర్తి( Principal G.K Murthy ) ఓ అద్భుతమైన ఔషధాన్ని కనుగొనడం జరిగింది.ఈ మందు వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవని ఆయన చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే, బాపట్లలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్‌ మూర్తికి ఎప్పటి నుంచో ప్రకృతితో మంచి సంబంధం వుంది.

ఈ క్రమంలోనే ఆయన వివిధరకాల మొక్కలను సేకరించి వాటి నుంచి మంచి మందులను తయారు చేయాలని కలలు కన్నారు.

Telugu Diabetes, Benefits, Care, Nature, Suger-Telugu Health

ఈ క్రమంలోనే ఆయన ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు.మన దేశంలో షుగర్‌తో బాధపడుతున్న వారి గురించి లెక్కింపు అనవసరం లేదేమో.ఎందుకంటే ఇక్కడ గడపకొక్కరు షుగర్‌తో బాధపడుతున్నవారే.

దీంతో షుగర్‌ను నియంత్రించే మొక్కల గురించి అధ్యయనం చేయడం ఆయన ప్రారంభించారు.ఈ క్రమంలో ఆస్ట్రేలియా గ్రాస్‌( Australian grass ) అని పిలిచే గడ్డిలో షుగర్‌ను నియంత్రించే సామర్థ్యం ఉందని తెలుసుకున్నారు.

తరువాత ఆ గడ్డిని సేకరించి ప్రయోగాలు ప్రారంభించారు.ఆ గడ్డిని వివిధ రకాలు సాల్వెంట్ కలిపి.

షుగర్‌ను నియంత్రించే మూలకాన్ని బయటకు తీసినట్లు మూర్తి చెబుతున్నారు.ఈ మందుతోపాటు సరైన ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల షుగర్‌ను పూర్తిగా అదుపులోకి వస్తుందని ప్రిన్సిపాల్‌ మూర్తి పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube