సాధారణంగా కొందరి పెదాలు గులాబీ రంగులో ఎర్రగా మెరుస్తుంటాయి.కానీ, పెదాల చుట్టు చర్మం మాత్రం నల్లగా అందవిహీనంగా కనిపిస్తుంటుంది.
శరీరంలో అధిక వేడి, ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వచ్చే మార్పులు, హైపర్ పిగ్మెంటేషన్, హార్మోన్ల అసమతుల్యత, పలు రకాల మందుల వాడకం, విటమిన్ల లోపం, ఎండల ప్రభావం వంటి రకరకాల కారణాల వల్ల పెదాల చుట్టూ ఉండే చర్మం నల్లగా మారుతుంటుంది.ఆ నలుపును చాలా మంది మేకప్‌తో కవర్ చేస్తుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాను ట్రై చేస్తే గనుక సహజంగానే ఆ నలుపును వదిలించుకోవచ్చు.మరి ఆ ఇంటి చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక లెమన్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి నీరు సగం అయ్యేంత వరకు ఉడికించాలి.ఇలా ఉడికించుకున్న వాటిని చల్లారబెట్టుకోవాలి.
పూర్తిగా కూల్ అయ్యాక బ్లెండర్‌లో నిమ్మ పండు స్లైసెస్, లవంగాలను వాటర్‌తో సహా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమం నుండి స్ట్రైనర్ సాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్రమాన్ని దూది సాయంతో పెదాల చుట్టూ అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల అనంతరం వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే నలుపు పోయి పెదాల చుట్టూ ఉండే చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.
