వైసీపీ ఎంపీ వీడియో అస‌లైంది కాదు.. ఎస్పీ ప్ర‌క‌ట‌న‌

ఏపీలో పెను దుమారం రేపిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో ఒరిజ‌న‌ల్ కాద‌ని రాష్ట్ర పోలీస్ శాఖ ప్ర‌క‌టించింది.ఈ మేర‌కు అనంత‌పురంలో ఏర్పాటు చేసిన‌ మీడియా స‌మావేశంలో జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

 Ycp Mp Video Is Not Original Sp Announcement , District Sp Fakirappa, Ycp Mp, Mp-TeluguStop.com

ఈ వీడియో అనేక సార్లు షేర్ అవ్వ‌డం వ‌ల‌న‌.ఆ వీడియో అసలైందా.? కాదా అనే విష‌యాన్ని తేల్చ‌డం క‌ష్టంగా మారింద‌ని తెలిపారు.

ఎంపీ గోరంట్ల‌కు చెందిన‌దిగా ఉన్న వీడియో ఇంగ్లండ్ లో రిజిష్ట‌ర్ అయిన నెంబ‌ర్ నుంచి సామాజిక మాధ్య‌మాల్లో అప్ లోడ్ అయిన‌ట్లు గుర్తించామ‌ని ఎస్పీ చెప్పారు.

ముందుగా ఐటీడీపీకి చెందిన వాట్సాప్ గ్రూప్ లో షేర్ అయ్యింద‌ని తెలిపారు.ఈ వీడియోపై ఎంపీ గోరంట్ల ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశామ‌ని వెల్ల‌డించారు.

అనంత‌రం వీడియోను అప్ లోడ్ చేసిన వ్య‌క్తి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నామ‌ని తెలిపారు.దీనిపై బాధితులు ఎవ‌రూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేద‌న్నారు.ఒరిజ‌న‌ల్ వీడియో దొరికేంత వ‌ర‌కు ఏం చెప్ప‌లేమ‌ని ఎస్పీ ఫ‌కీర‌ప్ప స్ప‌ష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube