అందాన్ని పెంచే డ్రాగన్ ఫ్రూట్.. ఇలా ముఖానికి పూస్తే మస్తు బెనిఫిట్స్!

డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ). దీని గురించి పరిచయాలు అవసరం లేదు.

 Best Way To Use Dragon Fruit For Glowing Skin!, Dragon Fruit, Dragon Fruit Benef-TeluguStop.com

ప్రస్తుతం అందరికీ డ్రాగన్ ఫ్రూట్స్ అందుబాటులోకి వచ్చాయి.పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది డ్రాగన్ ఫ్రూట్స్ ను ఇష్టంగా తింటున్నారు.

డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, ప్రోటీన్ తో పాటు డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది.అందువల్ల డ్రాగన్ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ల‌భిస్తాయి.

అలాగే అందాన్ని పెంచడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుందని మీకు తెలుసా.? ముఖ్యంగా ముఖానికి ఇప్పుడు చెప్పబోయే విధంగా డ్రాగన్ ఫ్రూట్ ను పూస్తే మస్తు స్కిన్ కేర్( Skin Care ) బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం చర్మానికి డ్రాగన్ ఫ్రూట్ ను ఎలా వాడాలి అన్నది తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Dragon Fruit, Dragonfruit, Skin, Latest, Skin Care, Skin Care Tips,

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అర కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ రోజ్‌ వాటర్( Rose Water ), వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు( Raw Milk ) వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Tips, Dragon Fruit, Dragonfruit, Skin, Latest, Skin Care, Skin Care Tips,

అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్ ను వేసుకుంటే చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.ముడతలు ఏమైనా ఉంటే త‌గ్గుముఖం ప‌డ‌తాయి.స్కిన్ టైట్ అవుతంది.చర్మంపై మొండి మచ్చలు క్ర‌మంగా దూరం అవుతాయి.మొటిమలు( Pimples ) రావడం కంట్రోల్ అవుతాయి.

చ‌ర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది.ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి.

చర్మం స్మూత్ అండ్ షైనీ గా సైతం మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube