ధన త్రయోదశిని( Dhana Trayodashi ) నవంబర్ 10వ తేదీన శుక్రవారం జరుపుకుంటారు.ధన త్రయోదశి ఈ రోజు మధ్యాహ్నం 12:35 నిమిషముల నుంచి మొదలవుతుంది.అలాగే మరుసటి రోజు నవంబర్ 11వ తేదీన శనివారం మధ్యాహ్నం ఒకటి 57 నిమిషములకు ముగుస్తుంది.ధన త్రయోదశి రోజు ప్రదోష కాలంలో పూజలు జరుగుతాయి.కాబట్టి నవంబర్ 10వ తేదీన ధన త్రయోదశి జరుపుకుంటారు.అయితే ధన త్రయోదశి ఘడియలు శనివారం కూడా ఉన్నాయని చెబుతున్నారు.
ఆ రోజును కూడా శని త్రయోదశిగా పరిగణిస్తారు.శనివారం త్రయోదశి ఉండడం చేత శని త్రయోదశి( Shani Trayodashi ) కూడా వచ్చిందని పండితులు చెబుతున్నారు.

నవంబర్ 11వ తేదీన శనివారం త్రయోదశి తిధి రోజున ధన త్రయోదశి పూజ ఉంటుంది.అదే రోజు శని త్రయోదశి కూడా వచ్చిందని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఏలినాటి శని, అర్ధాష్టమా శని, అష్టమ శని, జాతకంలో శని దోషాలు ఉన్నటు వంటి వారు శని మహర్దశ,శని అంతర్దశ వల్ల శని ప్రభావానికి గురైన వారికి శని త్రయోదశి ఎంతో విశేషమైన రోజని నిపుణులు చెబుతున్నారు.ఈ శని త్రయోదశి సందర్భంగా ఎవరైతే నవగ్రహ దేవాలయాలను( Navagraha Temples ) దర్శించి తైలాభిషేకం వంటివి చేసుకొని శనికి సంబంధించినటువంటి శాంతులు, దానాలు చేసుకుంటారు.

వారికి శని గ్రహానికి సంబంధించిన పీడలు ఇతి బాధలు తొలగిపోతాయి.నవంబర్ 11వ తేదీన శని త్రయోదశి రోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్యలో నవగ్రహ దేవాలయాలను దర్శించడం, శనికి తైలాభిషేకం( Tailabhisekam ) వంటివి చేసుకోవడం,అలాగే నువ్వులు వంటి వాటిని ధానం చేయడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి శని గ్రహ బాధలు తొలగి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మందపల్లి తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరునల్లార్ మరియు మహారాష్ట్రలోని శని శింగపూర్( Shani Shingnapur ) వంటి క్షేత్రాలను దర్శించుకుని నువ్వుల నూనెతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.