స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) గత సినిమాలు ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోకపోయినా ప్రభాస్ క్రేజ్ అణువంతైనా తగ్గలేదు.ప్రభాస్ ఆదిపురుష్ మూవీ( Adipurush Movie ) పది రోజుల క్రితం బుల్లితెరపై స్టార్ మా ఛానల్ లో( Star Maa ) ప్రసారమైన సంగతి తెలిసిందే.
వెండితెరపై ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా బుల్లితెరపై మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.ఫ్లాప్ సినిమాతో కూడా ప్రభాస్ సత్తా చాటారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ అర్బన్ రేటింగ్ ఏకంగా 9.47 కావడం గమనార్హం.అర్బన్ + రూరల్ రేటింగ్ విషయానికి వస్తే ఆదిపురుష్ మూవీకి 8.41గా ఉంది.వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమై మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి రేటింగ్ ను( TRP Rating ) సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

ఆదిపురుష్ మూవీ టీవీలో దుమ్ము రేపిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.వరల్డ్ కప్ ( World Cup ) ప్రసారమవుతున్న సమయంలో ఈ స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకోవడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైందని మరి కొందరు చెబుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory ) ఈ సినిమాను రిలీజ్ చేసింది.ఓవర్సీస్ లో ఆదిపురుష్ మూవీ 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించింది.

ప్రభాస్ సలార్ మూవీ( Salaar ) రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది.ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ నెల 1వ తేదీన రిలీజ్ కానుంది.సలార్ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని మైథలాజికల్ ప్రాజెక్ట్ లలో నటించనున్నారని తెలుస్తోంది.స్టార్ హీరో ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతోంది.