వర్షాకాలంలో దగ్గరపడుతోంది.జలుబు ఈజీగా వచ్చేస్తుంది.
దాంతో పాటు జ్వరం కూడా త్వరగానే వచ్చేస్తుంది.ఇక వైరల్ ఫివర్ లాంటివి వచ్చాయంటే, ఓ పట్టాన పోవు.
ఈ జ్వారాల్ని ఇంట్లో నుండే తరిమేసి ఉపాయాలున్నాయి.అవేంటో చూద్దాం.
* పసుపుకి ప్రపంచంలోని ఈ రోగంపై అయినా ప్రభావం చూపే శక్తి ఉంటుంది.పసుపు బేకిక్ గా ఒక యాంటి బ్యాక్టీరియా.
ఇది రోగాలను మోసుకొచ్చే క్రీములను సులువుగా నాశనం చేస్తుంది.జ్వరం గాని వస్తే, కాస్తంత పసుపుని గోరువెచ్చని నీటిలో, లేదా గోరువెచ్చని పాలలో కలుపుకోని తాగండి.
జ్యూస్ లో కూడా పసుపుని కలుపుకోని తాగొచ్చు.
* ఉల్లిగడ్డ కూడా బ్యాక్టీరియాను తిరిమివేయడానికి పనికివస్తుంది.
జలుబు చేసినా, జ్వరం వచ్చినా, ఉల్లిగడ్డ జ్యూస్ చేసుకోని, కొద్దికొద్దిగా, రోజంతా తాగుతూ ఉండాలి.దీంతో జ్వరాన్ని తప్పకుండా తరిమేయవచ్చు.
* తులసి ఆకులు తినండిరా అంటూ మన నానమ్మో, తాతయ్యో చెబితే అసలు పట్టించుకోం కదా.కాని జ్వరానికి పెద్ద శతృవు తులసి.జ్వరం వచ్చినప్పుడు తులసి ఆకులను దంచి, నుదురు, ఛాతిపై రాసుకోవాలి.కాసేపట్లో ఉపశమనం తప్పక లభిస్తుంది.అలాగే తులసిని తేనేలో కలుపుకోని తాగొచ్చు.
* అల్లం ముక్కను వేడి నీళ్ళలో వేసి, చల్లారాక తాగితే మంచి ఫలితాలు కనబడతాయి.