భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం.వివిధ రాష్ట్రాలలో సామాజిక, ఆర్థిక, మతపరమైన వైవిధ్యం కనిపిస్తుంది.
భారతదేశంలో వివిధ మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు పరస్పర సామరస్యంతో జీవిస్తున్నారు.అలాగే దేశంలో మంత్రవిద్య, అద్భుతాలు, మూఢనమ్మకాలు మొదలైనవి కూడా ఉన్నాయి.
దేవుడు ఉన్నాడని కొందరు నమ్మితే, మరికొందరు లేడని అంటారు.బిహార్‌లోని బక్సర్ జిల్లాలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి అనే ఆలయం ఉంది, ఇక్కడ విగ్రహాలు రాత్రిపూట కలిసి మాట్లాడుకుంటాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఈ ఆలయంలో అర్ధరాత్రి వేళ కొన్ని స్వరాలు వినిపిస్తుంటాయి.నగర ప్రజలు ఈ ఆలయం నుండి వినిపించే మాటలను విన్నామని చెబుతుంటారు.
ఆలయంలోని విగ్రహాలు తమలో తాము మాట్లాడుకుంటాయట.ఈ కారణంగా ఈ ఆలయం.
లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.ఈ ఆలయ ప్రాంగణంలో ఏవో మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయనే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు.
ప్రముఖ తాంత్రికుడు భవానీ మిశ్రా ఈ ఆలయాన్ని దాదాపు 400 సంవత్సరాల క్రితం నిర్మించారు.అప్పటి నుండి నేటి వరకు అతని వారసులు ఈ ఆలయంలో పూజారులుగా ఉన్నారు.
ఈ ఆలయం తంత్ర సాధనకు ప్రసిద్ధి చెందింది.సాధకుని కోరికలు ఇక్కడ నెరవేరుతాయని చెబుతారు.ఇక్కడ పలువురు రాత్రివేళ ఆధ్యాత్మిక సాధన చేస్తారు.ఈ ఆలయంలో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి మాత విగ్రహంతో పాటు బగ్లాముఖి మాత, తారా మాత, దత్తాత్రేయ, భైరవుడు మొదలైన విగ్రహాలు ఉన్నాయి.
ఈ ఆలయ రహస్యాన్ని ఇప్పటికీ ఎవరూ ఛేదించలేదు.ఆలయం నుండి ఎవరి స్వరం ఎందుకు వినిపిస్తుందో ఎవరూ తెలుసుకోలేకపోయారు.ఈ ఆలయానికి లెక్కకు మించిన భక్తులు అమ్మవారి దీవెనలు పొందేందుకు పొడవాటి క్యూలో నిల్చుని ఉండడం కనిపిస్తుంటుంది.