ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల పుణ్య క్షేత్రానికి ప్రతి రోజు ఎంతో మంది భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది భక్తులు స్వామి వారికి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.
మరి కొంత మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీవారిని ( Tirumala Srivaru )దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా చాలా మంది భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు.
అందువల్ల తిరుమలలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.ఇంకా చెప్పాలంటే గురువారం రోజున స్వామి వారిని దాదాపు 60 వేల మంది దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) వెల్లడించింది.
అలాగే 26 వేల మంది స్వామి వారికి తల నీలాలు సమర్పించినట్లు సమాచారం.అయితే భక్తులు హుండీ( Hundi) ద్వారా కానుకలుగా 3.72 కోట్లను సమర్పించారు.ముఖ్యంగా చెప్పాలంటే సర్వ దర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 19 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
అంతే కాకుండా స్వామి వారి సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.శ్రీవారి దేవాలయంలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శ్రీ వారికి అర్చకులు కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.శుక్రవారం ప్రత్యూషకాల ఆరాధనతో దేవాలయ ద్వారాలను అర్చకులు తెరిచారు.బంగారు వాకిలి వద్ద శ్రీ వెంకటేశ్వర సుప్రభాత స్త్రోతం తో స్వామి వారిని మేలుకొలిపారు.
ఆ తర్వాత ఆకాశ జలాలతో శ్రీ వెంకటేశ్వరుడికి అభిషేక సేవను దేవాలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఆ తర్వాత తోమల, అర్చన సేవలు అర్చకులు నిర్వహించారు.ప్రాతఃకాల ఆరాధన లో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ సేవా ను కూడా నిర్వహించారు.