సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ముచ్చటగా మూడవసారి తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ SSMB28.మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
అందులోను త్రివిక్రమ్ వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ (Trivikram) కూడా ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగగా ఈ మధ్యనే షూట్ కు కొద్దిగా బ్రేక్ ఇవ్వడంతో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని.తండ్రి కొడుకుల పాత్రలో మహేష్ కనిపించ బోతున్నట్టు టాక్ వైరల్ అవుతుంది.మరీ ముఖ్యంగా తండ్రిగా మహేష్ గెటప్ ఒక రేంజ్ లో ఉంటుంది అని ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఈ ఫాదర్ రోల్ రివీల్ అవుతుంది అని టాక్.

ఇదిలా ఉండగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (SreeLeela) హీరోయిన్ లుగా నటిస్తుండగా.జగపతిబాబు (Jagapathi Babu) నెగిటివ్ రోల్ లో నటిస్తున్నాడు.మొదటిసారి మహేష్ బాబు పాన్ ఇండియన్ సినిమా చేస్తుండడం వల్ల ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
చూడాలి మహేష్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో.







