ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొడితే ఆ తర్వాత ఏళ్లకు ఏళ్ళు హిట్ లేని స్టార్స్ వీళ్ళే !

ఒక్క హిట్టు సినిమా తీయాలంటే దానికి ఎన్నో కుదరాలి.కథ, కాస్టింగ్, బడ్జెట్, సంగీతం వంటి అంశాలు సరిగ్గా సెట్ అవుతూనే అది మంచి విజయం అవుతుంది.

 Tollywood Stars Who Have No Hit Afer Black Buster , Tollywood Stars,krishna ,pra-TeluguStop.com

కొన్ని సార్లు ఇలాంటి విజయాలు దక్కించుకోవడం కూడా ఎంతో ప్రమాదమే.ఆ హిట్టు కొన్నేళ్ల పాటు సదరు హీరో లేదా హీరోయిన్ కి పీడకల లాగ మిగిలిపోతుంది.

ఒక్క బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టగానే జనాల్లో అంచనాలు బాగా పెరిగిపోతాయి.ఆ తర్వాత ఏ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూడా మళ్లి అంతకు ముందు వచ్చిన సినిమా తో పోల్చి అదే రేంజ్ హిట్ ని ఎక్ష్పెక్త్ చేస్తారు.

కానీ ఆలా లేకపోతే ఆ తర్వాత అన్ని పరాభవాలే దొరుకుతాయి.మరి ఆలా ఏళ్లకు ఏళ్ళు హిట్టు దొరకని ఆ స్టార్ నటీనటులు ఎవరో చూద్దాం.

కృష్ణ


అల్లూరి సీతారామరాజు సినిమా తో తెలుగు నాట సూపర్ స్టార్ కృష్ణ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.ఆ తర్వాత చాల ఏళ్ళ పాటు అల్లూరి లాంటి సినిమా తీయలేక ఎన్నో ఫ్లాప్స్ చూసాడు కృష్ణ, తీసిన ప్రతి సినిమా అల్లూరి అవ్వలేదు కాబట్టి మాములు హీరో అవ్వడానికి దాదాపు 8 ఏళ్ళ సమయం పట్టింది.

ప్రభాస్


బాహుబలి లాంటి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరో అయినా ప్రభాస్ ఆ తర్వాత బాహుబలి 2 తో తన ప్రభంజనం మరింత పెంచుకున్నాడు.రాజమౌళి స్కూల్ నుంచి బయటకు వచ్చి సాహూ, రాధే శ్యామ్ వంటి సినిమాలు తీసిన బాహుబలి సినిమాతో పోల్చి చూసి ఫ్లాప్ సినిమాలుగా మార్చేశారు ప్రేక్షకులు.ఇక రానున్న సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

రానా


బాహుబలి సినిమాల ద్వారా సూపర్ విలన్ గా పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాడు రానా.అతడు ఇప్పడు హీరోగా తీస్తే జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు.అందుకు ఉదాహరణలు అరణ్య, విరాట పర్వం.

భారీ అంచనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అర్ధం కాకపోయినా రానాకు ఇప్పటికి అయితే హిట్టు లేదు.

కీర్తి సురేష్


మహానటి సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక అయినా కీర్తి సురేష్ కి ఈ సినిమా విజయం తర్వాత దాదాపు నాలుగేళ్లకు మళ్లి సర్కారు వారి పాట సినిమా తో హిట్టు దొరికింది.మహానటి కి సర్కారు వారి పాట సినిమాకు మధ్య దాదాపు తొమ్మిది సినిమాలు తీసిన ఒక్క హిట్టు కూడా పడలేదు కీర్తికి.

Tollywood Actors Who have no hit After Blockbuster

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube