కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29వ తేదీ గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈయన మరణించి ఏడాది కావస్తున్నప్పటికీ ఈయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోగా మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను చేస్తూ మంచి మనసున్న వ్యక్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా నటించిన చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.
పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన సినిమా గంధన గుడి.
పునీత్ రాజ్ కుమార్ ప్రొడక్షన్ బ్యానర్ పై పునీత్ సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ ఎంతగానో అభిమానులను ఆకట్టుకుంది.ఇకపోతే ఈ సినిమాని పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన చనిపోయిన రోజుకు ఒకరోజు ముందుగా అనగా అక్టోబర్ 28వ తేదీ విడుదల కావడానికి సిద్ధమవుతోంది.

పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా కావడంతో ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని అభిమానులు సైతం భావిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఈ సినిమా విడుదల విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది.ఈనేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పునీత్ చివరి సినిమా గందన గుడికి పండు మినహాయింపు ఇస్తున్నట్లు ఈయన తెలిపారు.అప్పు ఎప్పటికీ మన హృదయాల్లోనే నిలిచి ఉంటారంటూ ఈ సందర్భంగా బసవరాజ్ బొమ్మై పునీత్ ఆఖరి సినిమా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.







