పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23వ తేదీ తన 43వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో పుట్టినరోజు సందర్భంగా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలను విడుదల చేయడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన బిల్లా చిత్రాన్ని విడుదల చేశారు.
ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రత్యేక షోలలో ప్రదర్శితం కావడంతో అభిమానులు అత్యుత్సాహం కనపరిచారు.
ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లి గూడెంలోని వెంకట్రామ థియేటర్ లో అభిమానులు బాణాసంచా కాలుస్తూ అత్యుత్సాహం కనబరిచారు.
అయితే ఈ విధంగా థియేటర్లో బాణ సంచాలు కాల్చడంతో ఆ బానసంచాల నుంచి వచ్చిన నిప్పుల కారణంగా అక్కడ సీట్లు కూడా అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెరరేగాయి.ఇలా థియేటర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై పలువురు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వీడియోలను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు.ఈ క్రమంలోనే వర్మ స్పందిస్తూ ఇది దీపావళి సెలబ్రేషన్ కాదు తమ అభిమాని హీరో సినిమా తెరపై నడుస్తుండగా అభిమానులు థియేటర్లను తగలబెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు.ఇది ప్రభాస్ అభిమానుల పిచ్చి చర్య అంటూ కామెంట్ చేశారు అదేవిధంగా ఇది ప్రభాస్ స్టైల్ ఫ్యాన్స్ దీపావళి సెలబ్రేషన్స్ అంటూ మరొక కామెంట్ చేశారు.
మొత్తానికి థియేటర్ ఘటనపై వర్మ స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.







