ఒకే ఒక్కమాటతో చిరు, నాగ్, వెంకీ మల్టీస్టారర్ మూవీ క్యాన్సిల్ అయ్యిందట.. !

తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు జోరందుకున్నాయి.పలువురు హీరోలు కలిసి సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు.

 Tollywood Biggest Multistarrer Shelved Due To Small Reason, Chirenjeevi, Nagarju-TeluguStop.com

అయితే గతంలో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు.దర్శకులు కూడా ఇలాంటి సినిమాలకు ఓకే చెప్పేవారు కాదు.

అయితే చాలా ఏండ్ల క్రితం టాలీవుడ్ లో ఓ మల్టీస్టారర్ సినిమాకు బీజం పడింది.టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ కలిసి సినిమా చేయడానికి ఓకే చెప్పారు.

కానీ ఓకే ఒక్క మాట కారణంగా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమాకు దర్శకత్వం వహించాలనుకున్న రాఘవేంద్ర రావు వెల్లడించారు.

2002లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు స్టార్స్ గా వరుస హిట్స్ అందుకుంటూ వెళుతున్నారు.వారి మధ్య మంచి స్నేహం బాగా ఉండేది.

అలాంటి స్టార్స్ తో సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డిసైడ్ అయ్యాడట.అందుకు ప్రత్యేకమైన ఒక కారణం కూడా ఉంది.

రాఘవేంద్రరావు అప్పటికే 99 సినిమాలు పూర్తి చేసుకున్నారు.తన 100వ సినిమా ఓ రేంజిలో ఉండాలని భావించారు.

ఈ ముగ్గురు హీరోల కోసం చిన్ని కృష్ణతో కథను రెడీ చేయించారు.టైటిల్ త్రివేణి సంగమం అని పేరు కూడా పెట్టారు.

అల్లు అరవింద్ – అశ్వినిదత్ తో కలిసి నిర్మాణంలో రాఘవేంద్రరావు కూడా భాగం కావాలని అనుకున్నారు.

Telugu Chiini Krishna, Chiru, Multier, Nagarjuna, Tollywood, Venkatesh-Telugu St

సినిమాకు అంతా ఒకే అయ్యింది అనుకుంటున్న టైంలో అశ్విని దత్ ఒక్క మాట చెప్పడంతో రాఘవేంద్రరావు ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకున్నాడట.ఎలా తీసినా కూడా తమ హీరోను ఒక చోట తక్కువ చూపించారు అని ఫ్యాన్స్ లో గొడవలు అవుతాయి.మనకు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటూ అశ్విన్ దత్ చెప్పడంతో దర్శకేంద్రుడు వెనక్కి తగ్గాడట.

ఆ సినిమాను వదిలేసి గంగోత్రి సినిమాను టేకప్ చేశాడట.ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు వెల్లడించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube