సోషల్ మీడియాలో ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయం చర్చకు వచ్చింది.మన దేశంలోని గుర్గావ్‌లో,( Gurgaon ) అమెరికాలోని న్యూయార్క్‌లో( New York ) ఇళ్ల ధరలు ఎంత భారీ తేడా కలిగి ఉంటాయో చూపించే ఒక పోస్ట్‌ను మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ గుర్జోత్ అహ్లూవాలియా( Gurjot Ahluwalia ) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.ఆయన ప్రకారం రూ.25 కోట్లతో గుర్గావ్‌లోని డీఎల్‌ఎఫ్ మాగ్నోలియాస్ లాంటి హై-ఎండ్ రెసిడెన్షియల్ ఏరియాలో 4 లేదా 5 బెడ్‌రూమ్‌లు ఉన్న ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనొచ్చు.ఈ అపార్ట్‌మెంట్‌లో స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, కవర్డ్ పార్కింగ్, గ్రీన్ స్పేసెస్ లాంటి అన్ని సౌకర్యాలు ఉంటాయి.అదే 25 కోట్లతో న్యూయార్క్‌లో నగరం మొత్తం కనిపించే అద్భుతమైన వ్యూ ఉన్న ఒక 6-రూమ్‌ల లగ్జరీ పెంట్‌హౌస్‌ను కొనొచ్చు.
గుర్జోత్ అహ్లూవాలియా ఈ కంపారిజన్ పోస్టు పెట్టాక, భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్( Real Estate Market ) గురించి ఒక పెద్ద చర్చ మొదలైంది.ఆయన భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను “స్కామ్”( Scam ) అని అభివర్ణించారు.ఆయన ఈ విధంగా అనడంతో సోషల్ మీడియాలో చాలా మంది స్పందించారు.చాలా మంది ఆయన మాటలతో ఏకీభవించారు.వారు భారతదేశంలో ఇళ్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు.ఒక వ్యక్తి ఈ మార్కెట్ ఒక “బుడగ” లాంటిదని, ఏదో ఒక రోజు పగిలిపోతుందని అన్నారు.
మరొకరు అమెరికాలో( America ) కేవలం 1 మిలియన్ డాలర్లతో ఒక భారీ బంగ్లా కొని సౌకర్యంగా ఉండవచ్చని అన్నారు.మరికొందరు దుబాయ్‌లో అదే ధరకు ఒకటి లేదా రెండు లగ్జరీ విల్లాలు కొనొచ్చని అన్నారు.ఒక వ్యక్తి గుర్గావ్‌లోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను విమర్శిస్తూ, దుబాయ్, సింగపూర్, న్యూయార్క్‌ల కంటే గుర్గావ్‌లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, సౌకర్యాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.