సాధారణంగా ఒక సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే ఆ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతుందనే సంగతి తెలిసిందే.ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాల వల్ల నిర్మాతలకు ఎలాంటి లాభం ఉండదు.
అలాంటి సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేసినా తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుందని చెప్పవచ్చు.అయితే మనీష్ షా( Manish Shah ) అనే వ్యక్తి మాత్రం తెలుగులో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలతో( Disaster Movies ) కళ్లు చెదిరే లాభాలను అందుకున్నారు.
వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా గోల్డ్ మైన్స్( Goldmines ) యూట్యూబ్ ఛానల్ అధినేత మనీష్ షా సక్సెస్ స్టోరీ వింటే ఒకింత ఆశ్చర్యపోవాలి.వరుడు,( Varudu ) శక్తి,( Shakti ) సికిందర్( Sikindar ) సినిమాలు సౌత్ సినీ ఇండస్ట్రీలో డిజాస్టర్లుగా నిలవగా ఈ సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్లకు మాత్రం రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.మాస్ సినిమా సౌత్ లో సైతం హిట్ గా నిలవగా ఈ సినిమా హక్కులను తక్కువ మొత్తానికి కొనుగోలు చేసి హిందీలో డబ్ చేస్తే ఏకంగా కోట్ల రూపాయలు వచ్చాయట.
గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానల్ రెవిన్యూ ఏకంగా ఏడాదికి 400 కోట్ల రూపాయలు అని తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.మనీష్ షా భవిష్యత్తును ఊహించి తెలివిగా పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయల లాభాలను సొంతం చేసుకుంటున్నారని చెప్పాలి.మనీష్ షా నార్త్ ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్లతో సత్తా చాటారు.
గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానల్ కు 101 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.ఈ యూట్యూబ్ ఛానల్ లో కొన్ని సినిమాలకు ఏకంగా 800 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
తెలుగులో ఫ్లాపైన సినిమాలను సైతం సరైన రీతిలో ఎడిటింగ్ చేసి డబ్ చేయడం ద్వారా మనీష్ షా సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.