ప్రకాశవంతమైన మెరిసే చర్మం కోసం ఆరెంజ్ పేస్ పాక్స్

ఆరెంజ్ లో యాంటిఆక్సిడెంట్లు, ముఖ్యమైన ఖనిజాలు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వటమే కాకుండా చర్మ సంరక్షణకు కూడా సహాయపడుతుంది.ఆరెంజ్ పేస్ పాక్స్ వేసవిలో చాలా బాగా సహాయపడతాయి.

 Homemade Orange Face Pack For Glowing Skin-TeluguStop.com

చర్మంపై ఉన్న ట్యాన్,నల్లని మచ్చలు,జిడ్డు తొలగించటానికి చాల సమర్ధవంతంగా పనిచేస్తాయి.ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం కాంతివంతంగా మారటానికి సహాయపడతాయి.

ఇప్పుడు ఆ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.


ఒక స్పూన్ ఆరెంజ్ రసంలో అర స్పూన్ తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

రెండు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ సోర్ క్రీం వేసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ పొడి చర్మాన్ని తగ్గించటమే యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది.

మూడు స్పూన్ల ఆరెంజ్ రసంలో ఒక స్పూన్ మజ్జిగ,రెండు స్పూన్లు శనగపిండి,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ప్యాక్ ముఖం మీద జిడ్డు తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube