ఈ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు అంటే దెయ్యాలు కూడా ఉంటాయని ఎంతో మంది భావిస్తుంటారు.ఆ విధంగా దయ్యాలు, భూతాలు ఉన్నాయని ఎంతో మంది నమ్ముతున్నారు.
ఈ క్రమంలోనే వాటి నుంచి కాపాడుకోవడం కోసం ఎంతోమంది హోమాలు, పూజలు, తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం వంటి పనులు చేస్తుంటారు.మనకు దైవశక్తి ఉన్నట్టుగానే దుష్ట శక్తులు కూడా ఉంటాయి.
దైవశక్తి నిత్యం మనల్ని వెంటబెట్టుకొని సక్రమైన మార్గంలో నడిపిస్తే దుష్టశక్తులు మాత్రం అడుగడుగునా ఆటంకం కలిగిస్తూ ఉంటాయి.
మన ఇంట్లో పవిత్రమైన వాతావరణం లేనప్పుడు ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయని భావిస్తుంటారు.
ఈ దుష్ట శక్తులు ఇంట్లో కుటుంబసభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపటం, ఇంట్లో ప్రశాంతతని దూరం చేయడం వంటివి చేస్తుంటాయని భావిస్తారు.అయితే ఈ విధంగా మన ఇంట్లో దుష్ట శక్తుల ప్రభావం లేదా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పద్ధతులను పాటించాలి.

దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి.సాధారణంగా మామిడి తోరణాలు కేవలం పండుగ సమయాలలో మాత్రమే కడతాము.కాని ప్రతి శుక్రవారం మామిడి తోరణాలు కట్టడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా, మన ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి ఉంటుంది.తులసి ఆకులను శుభ్రమైన నీటితో కడిగి వాటి నుంచి రసం తీయాలి.
ఆ రసం నీటిలో కలుపుకొని ఇంట్లో చల్లడం వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది.మన ఇంట్లో ఏడాదికి ఒకసారైనా పురోహితుల చేత యజ్ఞం నిర్వహించాలి.
కొద్దిగా జీలకర్ర ఉప్పు కలిపి వాటిని ప్రధానద్వారం దగ్గర కిటికీలు తలుపుల దగ్గర వేయటం వల్ల మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా, నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయని పండితులు చెబుతున్నారు.