ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ లో కాస్త చులకనగా చూసేవారు.సౌత్ సినిమాలు అక్కడ విడుదలైన ఎవరూ పట్టించుకునే వారు కాదు.
కానీ ఇటీవలి కాలంలో మాత్రం సౌత్ సినిమాలకు బాలీవుడ్లో ఒక రేంజ్ లో క్రేజ్ పెరిగిపోయింది.అంతే కాదు సౌత్ సినిమాలే భారతీయ సినిమాగా గుర్తింపు సంపాదించుకుంటుంది.
ఇప్పటి వరకు విడుదలైన త్రిబుల్ ఆర్, పుష్ప, కే జి ఎఫ్ సినిమాలు ఇక ఇండియా వ్యాప్తంగా సత్తాచాటి రికార్డులు కొల్లగొట్టాయి.అప్పటి వరకు ఉన్న ప్రాంతీయ సరిహద్దులను ఇక ఈ సినిమాలో విచ్ఛిన్నం చేసాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అంతే కాదు సౌత్ సినిమాలను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంది అక్కడ బాలీవుడ్ మీడియా.
మొన్నటి వరకు ఎక్కడ చూసినా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది.
ఏ థియేటర్లలో విడుదల అవుతుంది అన్న ప్రశ్న బాలీవుడ్ ప్రేక్షకులు అందరిలో ఉంది.ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఇదే పరిస్థితి.ఇక పుష్ప సినిమా గురించి అంతలా టాక్ లేకపోయినప్పటికీ ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది.అయితే ప్రాంతీయ సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదలై విజయం సాధించడం ఇంత తక్కువ సమయంలో ఎలా అన్నది కూడా సినీ విశ్లేషకులు అర్థంకాని పరిస్థితి.
ప్రేక్షకుల ఊహకందని విధంగా కంటెంట్ అందిస్తే ఏ సినిమా అనీ చూడకుండా ప్రేక్షకులు ఆదరిస్తారన్న దానికి భాష అడ్డు రాదు అన్నదానానికి ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్, పుష్ప, కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాలు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయ్.

ఇకపోతే ఇటీవల కాలంలో అటు బాలీవుడ్ హీరోల పేర్లు ఇంటి పేర్లు వారి గత సినిమాల వివరాలు ఎలా గుర్తుంటున్నాయో.ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న ప్రేక్షకులకు అటు తెలుగు సినిమా హీరోల పేర్లు ఇంటి పేర్లతో సహా అన్ని గుర్తుండిపోతున్నాయ్.అంతేకాదు ప్రస్తుతం ఓటీటీ అందుబాటులోకి రావడం వల్ల కూడా ప్రాంతీయ సరిహద్దులు పూర్తిగా తొలగిపోయాయ్ అన్నది తెలుస్తోంది.
ఎందుకంటే ఓటిటి వేదికగా విడుదల అవుతున్న ఎన్నో వెబ్ సిరీస్ లు సినిమాలు కూడా అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి.ఏది ఏమైనా ఇటీవలి కాలంలో సౌత్ హీరోల సినిమాలను బాలీవుడ్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉండటం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇక సౌత్ సినిమాలకు క్రేజ్ పెరిగిపోవటానికి మాత్రం బాహుబలి 2 సినిమా కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.







