టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన కు ప్రతి ఒక్కరు ఫిదా అయిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కబోతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ను తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే ఆలియా భట్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న విషయం తెలిసిందే.కాబట్టి తన పెళ్లి కారణంగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమా నుంచి తప్పుకుంది అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వార్తల్లో నిజానిజాలు గురించి పక్కన పెడితే ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూన్ మొదటి వారం నుంచి మొదలు పెట్టాలి అని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ చిత్రీకరించబోతున్నారు అని తెలుస్తోంది.ఇకపోతే గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు అభిమానులు.సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.







