ఉదయాన్నే నిమ్మరసం తాగితే బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు.. ఈ బెనిఫిట్స్ కూడా!

ఇటీవ‌ల కాలంలో దాదాపు అంద‌రూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నారు.అధిక బ‌రువును అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అలాంటి వాటిలో ఉద‌యాన్నే వేడి నీరు, నిమ్మ‌ర‌సం క‌లిపి తీసుకోవ‌డం కూడా ఒక‌టి.చాలా మంది ఉద‌యాన్నే నిమ్మ ‌ర‌సంను వేడి నీటిలో క‌లిపి తీసుకుంటారు.

అయితే ఇలా నిమ్మ‌ర‌సం తీసుకోవ‌డం‌ వ‌ల్ల కేవ‌లం బ‌రువు త‌గ్గ‌డం ఒక్క‌టే ప్ర‌యోజ‌నం కాదు.మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

అవేంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ఇటీవ‌ల వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది కిడ్నీలో రాళ్ల స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు.

Advertisement

అయితే ఉద‌యాన్నే వేడి నీటిలో నిమ్మ‌రసం క‌లిపి తీసుకోవడం వ‌ల్ల.అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్ప‌డ్డ‌ చిన్న చిన్న రాళ్ల‌ను క‌రిగించేస్తుంది.

అలాగే నిమ్మరసంలో విటమిన్ సి పుష్క‌లంగా ఉంటుంది.కాబ‌ట్టి, ఉద‌యాన్నే నిమ్మ‌రసం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

త‌ద్వారా జ్వ‌రాలు, జ‌లుబు, ర‌క‌ర‌కాల వైర‌స్‌లు ద‌రిచేర‌కుండా ఉంటాయి.నిమ్మ‌రం తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మానికి కూడా ఎంతో మేలు జ‌రుగుతుంది.

ముఖ్యంగా చ‌ర్మాన్ని మృదువుగా మ‌రియు వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయ‌కుండా చేస్తుంది.అలాగే శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలోనూ నిమ్మ‌రసం గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయంతో పేరుకుపోయి ఉన్న విష ప‌దార్థాల‌ను బ‌ట‌య‌కు పంపిస్తుంది.కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమ‌స్య‌ల‌ను కూడా నిమ్మ‌ర‌సం దూరం చేస్తుంది.

Advertisement

అదే స‌మ‌యంలో జీర్ణ శ‌క్తిని రెట్టింపు చేస్తుంది.ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌రో అద్భుత‌మైన బెనిఫిట్ ఏంటంటే.

ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి.కాబ‌ట్టి, మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారు ప్ర‌తి రోజు ఉద‌యాన్నే ఖ‌చ్చితంగా నిమ్మ‌ర‌సంను వేడి నీటిలో క‌లిపి తీసుకోండి.

తాజా వార్తలు