మున్సిపల్ ఎన్నికలకు జనసేన రెడీ... సత్తా చాటేనా?

ఆంధ్రప్రదేశ్ లో పలు మున్సిపల్ కార్పొరేషన్ లకు ఎన్నికలు జరగడానికి సమయం సమీపిస్తోంది.ఇప్పటికే టీడీపీ, వైసీపీ పార్టీ, జనసేన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకై ప్రయత్నాలు ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది.

 Janasena Ready For Municipal Elections ,cm Jagan, Ycp, Tdp, Chandrababu, Janasen-TeluguStop.com

అయితే ముఖ్యంగా జనసేన పార్టీ విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎంతో కొంత సత్తా చాటి రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకున్న పరిస్థితి ఉంది.దీంతో అదే జోష్ తో కుప్పం, నెల్లూరు ఇంకా మిగతా కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించుట కొరకై క్షేత్ర స్థాయిలో పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

అయితే నెల్లూరు జిల్లాలో పోటీ చేయనున్న జనసైనికుల అభ్యర్థులను నిన్న జనసేన పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Telugu Ap Cm Jagan, Ap, Ap Tdp, Chandrababu, Cm Jagan, Janasena, Janasena Ready,

అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తరహాలో అధికార పార్టీ ప్రలోభాలను తట్టుకొని జనసేన పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమే అని చెప్పవచ్చు.అయితే అధికార పార్టీ అయిన వైసీపీ  ఇప్పటికే అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లలో నెగ్గడంపై పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించడమే కాక క్షేత్ర స్థాయిలో తమ గెలుపుకు అడ్డు వస్తారని భావించిన వారితో సంప్రదింపులు జరుపుతూ తమ పార్టీకి మద్దతిచ్చేలా బుజ్జగిస్తున్న పరిస్థితి ఉంది.అయితే జనసేన మాత్రం ప్రజలు తమకు ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒకింత ఆగ్రహంతో ఉన్నారని జనసేన పెద్ద ఎత్తున నమ్మకంతో ఉన్న పరిస్థితి ఉంది.

ఒకవేళ జనసేన ఊహించింది జరిగితే జనసైనికుల్లో మరింత జోష్ ను నింపే అవకాశం ఉంది.ఏది ఏమైనా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతుందా, పోరాడి ఓడిపోతుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube