ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఏ నియోజకవర్గం అంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.కూటమి, వైసీపీ( YCP ) గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నా ఏ పార్టీది గెలుపో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 This Constituencey Become Hot Topic In Ap Elections Details Here Goes Viral In-TeluguStop.com

అయితే ఏపీలోని ఒక నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.ఆ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థులలో ఎక్కువమందికి మంత్రి పదవి దక్కడం గమనార్హం.

బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గం( Vemuru Constituency ) నుంచి పోటీ చేసిన అభ్యర్థులలో ఎనిమిది మందికి మంత్రి పదవులు దక్కాయి.ఒక విధంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి.

ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 15సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమనార్హం.ఈ నియోజకవర్గంలో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో ఎక్కువ సందర్భాల్లో అధికారంలోకి వచ్చింది.

ఈ నియోజకవర్గం పేరు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో మారుమ్రోగుతోంది.

Telugu Ap Cm Ys Jagan, Ap, Constituencey-Politics

ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) రుణమాఫీ హామీని ప్రకటిస్తే కూటమి గోవింద అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జగన్ మాత్రం ఈ హామీని ప్రకటిస్తారో లేదో అనే టెన్షన్ వైసీపీలో ఉంది.ఎన్నికలకు రెండు వారాల సమయం ఉన్నా వైసీపీ మేనిఫెస్టోను ఇంకా ప్రకటించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ మాత్రం 10 కొత్త హామీలను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

Telugu Ap Cm Ys Jagan, Ap, Constituencey-Politics

జగన్, కూటమి ఎన్నికల్లో గెలుపు కోసం భారీ హామీలను ప్రకటించగా ఆ హామీలను అమలు చేయడం సులువు అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వైసీపీ, కూటమిలలో ఏ పార్టీ కనీసం 100 స్థానాలలో విజయం సాధిస్తుందో చూడాల్సి ఉంది.వైసీపీ, కూటమి ఈ ఎన్నికల్లో గెలుపు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రజల్లో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేస్తుండటం అభ్యర్థులకు కలిసొస్తోంది.ఎన్నికల సమయానికి రాష్ట్రంలో పరిస్థితులు ఏ పార్టీకి అనుకూలంగా మారతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube