CV Sridhar: గొప్ప రచయిత మాత్రమే కాదు టాలెంటెడ్ డైరెక్టర్ కూడా.. సీ.వీ శ్రీధర్ అప్పట్లో అందరికీ ఫేవరెట్…

కొన్ని దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల నుంచి వలసపోయి తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోయిన తెలుగు వారు ఎందరో ఉన్నారు.అక్కడికి వెళ్లిపోయిన తర్వాత అక్కడి సాంప్రదాయాలను పాటిస్తూ భాష నేర్చుకొని వారిలో కలిసిపోయారు.

 Unknown Facts About Cv Sridhar-TeluguStop.com

అంతేకాదు తమిళనాట అనేక రంగాలలో తమ అసాధారణమైన ప్రతిభతో గొప్ప గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.అలాంటి ప్రతిభావంతులలో C.

V.శ్రీధర్( CV Sridhar ) ఒకరు.1950-90 కాలంలో కోలీవుడ్ ఇండస్ట్రీలో రచయిత, నిర్మాత, దర్శకుడిగా శ్రీధర్ రాణించాడు.

మొత్తం 60 తమిళ, తెలుగు, హిందీ సినిమాలను డైరెక్ట్ చేసి ఆ రోజుల్లో స్టార్ డైరెక్టర్ గా( Star Director ) ఎదిగాడు.చిట్టమూరు విజయరాఘవులు శ్రీధర్ ఈ దర్శకుడి పూర్తి పేరు.1951లో సొంత స్క్రిప్ట్‌తో AVM స్టూడియోలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు శ్రీధర్ కానీ ఆ సమయంలో అతడికి తిరస్కరణ ఎదురయింది.సేమ్ స్క్రిప్ట్ మరో నిర్మాతకి వినిపించగా అది అతనికి బాగా నచ్చింది.దాంతో శ్రీధర్ ని బాగా ఎంకరేజ్ చేశాడు.ఆ నిర్మాత ప్రోత్సాహంతో శ్రీధర్ రక్తపాశం( Rakthapasham ) తమిళ మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు.

AVM స్టూడియోస్ ఈ సినిమా చూసి దీని కథ చాలా బాగుంది అనుకున్నారు.

ముందు శ్రీధర్ చెప్పినప్పుడు అనవసరంగా వద్దనుకున్నామని పశ్చాత్తాపడ్డారు.చేసేదేమీ లేక అదే సినిమాని హిందీ లో రీమేక్ గా తెరకెక్కించారు.ఆ మూవీ బాగానే ఆడింది.1960లో పెళ్ళికానుక సినిమాని( Pellikanuka Movie ) శ్రీధర్ తెరకెక్కించాడు ఈ మూవీ కూడా బాగా ఆడింది.తమిళంలో చాలా సినిమాలే చేశాడు.చాలా మంచి కథలు డైలాగులు రాస్తూ రాజ్ కపూర్, రాజేంద్ర కుమార్, జితేంద్ర, అమితాబ్‌ బచ్చన్, శశి కపూర్ వంటి హీరోల సినిమాలకు ఫేవరెట్ రైటర్ గా మారాడు.

Telugu Chitralaya, Cv Sridhar, Cvsridhar, Kalyana Parisu, Kanchana, Legendarycv,

రచయితగా చాలా గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత ప్రొడ్యూసర్ గా అవతారమెత్తి వీనస్ పిక్చర్స్,1961 లో చిత్రాలయ( Chitralaya ) అనే ప్రొడక్షన్ హౌసెస్ ప్రారంభించాడు.“కళ్యాణ పరిసు (1959)”( Kalyana Parisu ) శ్రీధర్ డైరెక్ట్ చేసిన తొలి చిత్రం.దీనిని తెలుగులో “పెళ్లి కానుక”గా. హిందీ లో నజరానాగా తెరకెక్కించారు.తొలి సినిమాతోనే డైరెక్టర్‌గా శ్రీధర్ తన సత్తా చాటాడు.ఆపై నెంజిల్ ఒరుం ఆలయం (1962) తమిళ్ సినిమాకు కథ అందించడంతోపాటు తానే డైరెక్ట్ చేశాడు.

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.దీనిని తెలుగులో మనసే మందిరం, హిందీలో దిల్ ఏక్ మందిర్ గా రీమేక్ చేయగా ఆ భాషల్లో కూడా బాగానే ఆడింది.

Telugu Chitralaya, Cv Sridhar, Cvsridhar, Kalyana Parisu, Kanchana, Legendarycv,

కాదలిక్క నేరమిల్లై (తెలుగులో ప్రేమించి చూడు) (హిందీలో ప్యార్ కియే జా) సినిమాకు కూడా శ్రీధర్ స్టోరీ అందించాడు డైలాగులు కూడా రాశాడు అవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.శ్రీధర్ 1933, జులైలో జన్మించాడు.చాలా మంది కొత్త నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.ఉదాహరణకు వసుంధర అనే తెలుగు ఎయిర్ హోస్టెస్ ని సినిమాల్లోకి తీసుకొచ్చి స్టార్ ని చేసాడు.

కాంచనగా( Kanchana ) పేరు తెచ్చుకున్న ఆమె పలు భాషల్లో నటించింది.

శ్రీధర్ తన సినిమా షూటింగ్‌ల కోసం మద్రాసు-బొంబాయి మధ్య తిరిగేవాడు.అన్ని భాషల వారి ప్రశంసలు అందుకున్నాడు.1997 లో అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం పలువురును అర్జించాడు.కానీ ప్రముఖ నటుడు రజనీకాంత్ మాత్రం ఆయనకు సహాయం చేసేందుకు నిరాకరించారు.శ్రీధర్ 20-10-1998న గుండెపోటుతో మరణించాడు.అతను తమిళనాడు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన గొప్ప దర్శకుడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube