హిందూ వివాహంలో ముఖ్యమైన అంశాలు ఏవో తెలుసా?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక మనిషి అమ్మ కడుపులో పడినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు.పుట్టిన మనిషి చనిపోయేలో ఎన్నెన్నో ఫంక్షన్లు, కార్యక్రమాలు జరిపిస్తారు.

 Do You Know What Are The Important Aspects Of Hindu Marriage , Devotional, Hindu-TeluguStop.com

అయితే ఒక్క పెళ్లిలోనే దాదాపు  35 రకాల కార్యక్రమాలు జరిపిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి.అయితే అవేంటి, హిందూ వివాహంలో జరిపించే ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా పెళ్లి చూపుల తంతు నిర్వహిస్తారు.ఇద్దరికీ ఓకే అనుకున్న తర్వాత నిశ్చయ తంబూలాలు.ఆ తర్వాత స్నాతక వ్రతం.అదయ్యాక కాశీ యాత్ర.

దీని తర్వాత వరపూజ ఎదుర్కోళ్లు.గౌరీ పూజ, వధూ వరుల మంగళ స్నానాలు, కన్యావరణం, మధుపర్కాలు, యజ్ఞోపవీత ధారణ, మహా సంకల్పం, కాళ్లు కడగడం, జీలకర్ర బెల్లం, కాళ్లు తొక్కించడం, కన్యాదానం, స్వర్ణ జలాభి మంత్రణం, యోక్త్ర బంధనం, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి, ఉంగరాలు తీయడం, సప్తపది, పాణి గ్రహనం, ప్రధాన హోమం, సన్నికల్లు తొక్కటం, లాజహోమం, స్థాళీపాకం, నాగవల్లి, సదస్యం, నల్ల పూసలు కట్టడం, అరుంధతీ దర్నం, ఉయ్యాల బొమ్మిని అప్పజెప్పటం, అంపకాలు (అప్పగింతలు),  గృహ ప్రవేశం – సత్యనారాయణ వ్రతం, కంకణ విమోచనం, గర్భాదానం… ఇలా పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యో లోపు చేసే కార్యక్రమాలు.

అయితే మనకు ఇవన్నీ తెలియకపోయినప్పటికీ అన్నింటిని మనం పూర్తి చేస్తుంటాం.కానీ వీటి అర్థాలు, ఇవెందుకు చేస్తున్నామో వివరించకపోవడం వల్ల చాలా మందికి వీటి గురించి పూర్తిగా తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube