బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందరికి తెలిసిందే.గత కొన్ని సంవత్సరాల నుండి ప్రసారం అవుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ షో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
ఇందులో పాల్గొన్న కమెడియన్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నారు.గతంలో మేల్ కంటెస్టెంట్ లు లేడీ గెటప్స్ వేసి సందడి చేయగా.
ఈమధ్య ఫిమేల్ ఆర్టిస్టులు కూడా పాల్గొని తమ అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటున్నారు.
అందులో వర్ష, రోహిణి, సత్య శ్రీ, షాబీనా, ఫైమా, పవిత్ర, రీతూ చౌదరి.
ఇక ముఖ్యంగా వర్ష, ఫైమా మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు.వర్ష తన అందంతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటే ఫైమా మాత్రం తన డైలాగ్స్ తో అందరిని తెగ నవ్విస్తుంది.
నిజానికి వర్ష బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్.జబర్దస్త్ తో తన పరిచయాన్ని పెంచుకుంది.
బుల్లితెరలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తెగ పంచుకుంటుంది.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక జబర్దస్త్ లో మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి చేసే రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.
అతనితో సన్నిహితంగా ఉంటూ హగ్ లతో, ముద్దులతో బాగా రెచ్చిపోతుంది.గతంలో వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి.

ఇక జబర్దస్త్ లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే మరో ఎంటర్టైన్మెంట్ షోలో కూడా బాగా సందడి చేస్తుంది.అలా ఆమెకు ఇమ్మాన్యుయేల్ తో మంచి క్రేజ్ అందింది.దాంతో ఆమెకు బుల్లి తెర పై ఓ గుర్తింపు పొందింది.కానీ ఫైమా మాత్రం సొంత టాలెంట్ తో జబర్దస్త్ లోకి అడుగుపెట్టింది.ఎవరి సపోర్ట్ లేకుండా తన సొంత డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈమె తొలి సారి పటాస్ షో తో ప్రేక్షకులకు పరిచయమైంది.
తను ఓ పేద కుటుంబం నుండి వచ్చానని వాళ్లందరూ ఆడపిల్లలేనని.అంతేకాకుండా వాళ్లంతా ఓ చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారని, ఆఖరికి బాత్రూం కూడా లేని ఆ ఇంటి కి రూ.3000 లకు అద్దె ఉంటున్నారని తెలిపింది.ఇక వాళ్ళ అమ్మ బీడీలు చుట్టే పనికి వెళ్లే వారిని ఇక తన ఆరోగ్యం సరిగా లేనందున పనికి వెళ్లడం లేదంటూ చెప్పుకొచ్చింది.
ఇక తన అక్కలకు అప్పులు చేసి పెళ్లి చేయగా.అవి తీర్చడానికి తన తండ్రి కష్టపడుతున్నారని గతంలో తెలిపింది.

అందుకు ఎవరి సపోర్టు లేకుండా ధైర్యంగా ముందుకు నడవాలనే ఆలోచనలో ఉందని చెప్పుకొచ్చింది.మొత్తానికి వర్షకు, ఫైమా కు టాలెంట్, అందం బట్టి అభిమానం ఉండగా.వీరిద్దరిలో ఫైమా కు జబర్దస్త్ షో తరపున లక్ష నుండి లక్ష 25 వేల రూపాయల పారితోషకం ఉంటుందని తెలిసింది.ఇక వర్షకు లక్ష కంటే కాస్త తక్కువగా ఉంటుందని.
మిగతా లేడీ కమెడియన్స్ కూడా 50 వేల వరకు ఉంటుందని తెలిసింది.







