చలిపెట్టిన కుంపటి.. నిండుప్రాణం బలి.. !- Old Woman Was Burned

old woman, burned, adilabad, indravelli - Telugu Adilabad, Burned, Indravelli, Old Woman

మృత్యువు ఏ వైపు నుండి తరుముకు వస్తుందో తెలుసుకోవడం చాలా కష్టం అన్న విషయం తెలిసిందే.ఒక్కోసారి కళ్ల ముందు ప్రాణాలు పోతున్న ఏమి చేయలేని పరిస్దితులు తలెత్తుతాయి.

 Old Woman Was Burned-TeluguStop.com

అప్పటి వరకు కళ్ల ముందు మెదిలిన వారు అంతలోనే కనుమరుగైతే వారి కుటుంబానికి కలిగే బాధ వర్ణానితం.

ఇక లోకంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్దితుల్లో చావు అంటే దాదాపుగా భయం లేనట్లుగా ఉంది.

ప్రపంచంలోకి కరోనా ప్రవేశించినాక మరణం కామన్ అనే అభిప్రాయం చాల మందిలో ఏర్పడింది.ఇక కాలం ఏదైనా మనుషులు చేస్తున్న పొరపాట్ల వల్ల ఒక్కోసారి వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చూ.

ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ గ్రామానికి చెందిన రేణుకాబాయి అనే 70 సంవత్సరాల వృద్ధురాలు ఈరోజు ఉదయం చలి కాచుకునేందుకు మంట వేయగా, ఆ కుంపటి ప్రమాదవశాత్తుగా ఆమె ఉంటున్న గుడిసెకు అంటుకుంది.

ఈ ప్రమాదంలో రేణుకాబాయికి కూడా నిప్పంటుకోగా మృతి చెందింది.ఆమెతో పాటుగా ఆ ఇంట్లో నిల్వ చేసిన 15 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది.

ఇక ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్దలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

#Old Woman #Burned #Indravelli #Adilabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు