ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవ రెడ్డిని బీజేపీ కుట్రపూరితంగా ఇరికించిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మాగుంట కుటుంబం మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం వెంటే ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో మాగుంట కుటుంబానికి వైసీపీ సపోర్ట్ చేయాలని బాలినేని చెప్పారు.మాగుంట రాఘవ రెడ్డికి సంబంధం లేకుండా నమోదైన కేసులు త్వరలోనే వీగిపోతాయని వెల్లడించారు.
కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఒంగోలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని ఫిబ్రవరిలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే రాఘవ రెడ్డిని సౌత్ గ్రూప్ లో కీలక పాత్రధారిగా ఈడీ పేర్కొంది.