వీడియో: వావ్, కొమ్ముల్లో చెట్టు కొమ్మ ఇరుక్కొని బాధపడుతున్న జింకకి జిరాఫీ సాయం..

సమాజంలో వీసమెత్తు మానవత్వం కనిపించని రోజులివి.తోటి మనిషి పక్కనే ప్రమాదంలో వున్నాడని తెలిసినా సహాయం చేయని మనుషులున్న ఈ ప్రపంచంలో జంతువులు మాత్రం తమ నిస్వార్ధమైన ప్రేమను పంచుతూనే ఉన్నాయి.

 Giraffe Removes Branch Stuck On Gazelles Head Details, Viral Latest, News Viral,-TeluguStop.com

తాజాగా ఈ మూగ జీవుల మధ్య ప్రేమకు ఓ అడవి వేదిక అయింది.వివరాలు తెలుసుకుంటే.

ఒక దట్టమైన అడవిలో ఆహారం కోసమని ఓ జింక పిల్ల బయలుదేరింది.ఈ క్రమంలోనే ఏదో ఒక క్రూర జంతువు దాన్ని తరిమింది.

దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు అది చెట్ల గుండా పరిగెత్తింది.ఈ క్రమంలో వంకర్లు తిరిగినా దాని కొమ్ములకు ఒక చెట్టు కొమ్మ ఇరుక్కుంది.

ఈ కొమ్మ బరువుకు ఆ జింక పిల్ల నడవలేక చాలా ఇబ్బంది పడింది.అంతేకాదు, ముందు ఏమీ కనిపించకుండా దాని కళ్లకు కొమ్మ అడ్డుగా ఉండటంతో అది ముందుకు వెళ్ళలేక బాధపడుతోంది.

అయితే అటుగా వెళ్తున్న ఓ జిరాఫీ నిస్సహాయ స్థితిలో బాధపడుతున్న ఈ జింకను చూసి ‘అయ్యో పాపం’ అన్నట్టుగా ఫీల్ అయిపోయింది.అనంతరం ఆ జింక పిల్ల కొమ్ముల్లో ఇరుక్కున చెట్టు కొమ్మని తన నోటితో తొలగించింది.

సాటి జంతువును బాధ నుంచి విముక్తి చేసిన జిరాఫీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.21 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను @yoda4ever అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా… ఇప్పటి వరకు ఈ వీడియోకి 1 లక్ష వరకు లైకులు, 18 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ బ్యూటిఫుల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube