వీడియో: వావ్, కొమ్ముల్లో చెట్టు కొమ్మ ఇరుక్కొని బాధపడుతున్న జింకకి జిరాఫీ సాయం..

సమాజంలో వీసమెత్తు మానవత్వం కనిపించని రోజులివి.తోటి మనిషి పక్కనే ప్రమాదంలో వున్నాడని తెలిసినా సహాయం చేయని మనుషులున్న ఈ ప్రపంచంలో జంతువులు మాత్రం తమ నిస్వార్ధమైన ప్రేమను పంచుతూనే ఉన్నాయి.

తాజాగా ఈ మూగ జీవుల మధ్య ప్రేమకు ఓ అడవి వేదిక అయింది.

వివరాలు తెలుసుకుంటే.ఒక దట్టమైన అడవిలో ఆహారం కోసమని ఓ జింక పిల్ల బయలుదేరింది.

ఈ క్రమంలోనే ఏదో ఒక క్రూర జంతువు దాన్ని తరిమింది.దీంతో ప్రాణాలను రక్షించుకునేందుకు అది చెట్ల గుండా పరిగెత్తింది.

ఈ క్రమంలో వంకర్లు తిరిగినా దాని కొమ్ములకు ఒక చెట్టు కొమ్మ ఇరుక్కుంది.

ఈ కొమ్మ బరువుకు ఆ జింక పిల్ల నడవలేక చాలా ఇబ్బంది పడింది.

అంతేకాదు, ముందు ఏమీ కనిపించకుండా దాని కళ్లకు కొమ్మ అడ్డుగా ఉండటంతో అది ముందుకు వెళ్ళలేక బాధపడుతోంది.

అయితే అటుగా వెళ్తున్న ఓ జిరాఫీ నిస్సహాయ స్థితిలో బాధపడుతున్న ఈ జింకను చూసి 'అయ్యో పాపం' అన్నట్టుగా ఫీల్ అయిపోయింది.

అనంతరం ఆ జింక పిల్ల కొమ్ముల్లో ఇరుక్కున చెట్టు కొమ్మని తన నోటితో తొలగించింది.

సాటి జంతువును బాధ నుంచి విముక్తి చేసిన జిరాఫీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

21 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను @yoda4ever అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేయగా.

ఇప్పటి వరకు ఈ వీడియోకి 1 లక్ష వరకు లైకులు, 18 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ బ్యూటిఫుల్ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.