జుట్టు సమస్యలన్నిటికీ చెక్ పెట్టే పుచ్చ గింజల నూనె.. ఎలా ఉపయోగించాలంటే?

దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక జుట్టు సమస్యతో స‌త‌మ‌తం అవుతూనే ఉంటారు.హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, హెయిర్ బ్రేకేజ్, హెయిర్ గ్రోత్ లేకపోవడం ఇలా ఏదో ఒక సమస్య మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతుంటుంది.

 Wonderful Benefits Of Watermelon Seed Oil For Hair! Watermelon Seed Oil Benefits-TeluguStop.com

అయితే అన్ని జుట్టు సమస్యలకు చెక్ పెట్టే ఆయిల్ ఒకటి ఉంది.అదే పుచ్చ గింజల నూనె( watermelon seed oil ).పుచ్చ గింజ‌ల నుంచి త‌యారు చేయ‌బ‌డే ఈ నూనె మ‌న‌కు సూప‌ర్ మార్కెట్స్ లో దొరుకుతుంది.ఈ ఆయిల్ ఆరోగ్యమైన జుట్టును ప్రోత్సహిస్తుంది.

జుట్టు సంబంధిత సమస్యలను సమర్థవంతంగా అరికడుతుంది.మరి ఇంతకీ పుచ్చ గింజల నూనె ను ఎలా ఉపయోగించాలి.? దాని ప్రయోజనాలు ఏంటి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Care, Care Tips, Fall, Oil, Problems, Healthy, Watermelonseed-Telugu Heal

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు(curd) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజల నూనె( watermelon seed oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Fall, Oil, Problems, Healthy, Watermelonseed-Telugu Heal

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.పుచ్చకాయ గింజల నూనె మీ జుట్టును హైడ్రేట్ చేస్తుంది.పొడి మరియు దెబ్బతిన్న జుట్టుకు పోషణ మరియు పునరుజ్జీవనం అందిస్తుంది.వెంట్రుకలను బలోపేతం చేయడానికి పుచ్చ గింజ‌ల నూనె ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.

Telugu Care, Care Tips, Fall, Oil, Problems, Healthy, Watermelonseed-Telugu Heal

ఆరోగ్యకరమైన మరియు బలమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.అలాగే పుచ్చ గింజ‌ల నూనెలో ఉండే మాయిశ్చరైజింగ్ మరియు కండిషనింగ్ లక్షణాలు జుట్టు ఎండిపోకుండా మరియు విరిగిపోకుండా నిరోధిస్తాయి.జుట్టు రాల‌డాన్ని ప్ర‌భావంతంగా అరిక‌డ‌తాయి.మ‌రియు పుచ్చ గింజ‌ల నూనె మీ జుట్టుకు సహజమైన షైన్ ఇస్తుంది.కాబ‌ట్టి ఆరోగ్య‌మైన ఒత్తైన జుట్టును కోరుకునే వారు త‌ప్ప‌కుండా పుచ్చ గింజ‌ల నూనెను పైన చెప్పిన విధంగా వాడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube