నోటిలో వెల్లుల్లిని 30 నిమిషాల పాటు పెట్టుకుంటే శరీరంలో ఎన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయో తెలుసా?

వెల్లుల్లి ఆరోగ్యపరంగా మనకు ఎన్ని ప్రయోజనాలను కలిగిస్తుందో మన అందరికి తెలిసిందే.అయితే ఎక్కువ ప్రయోజనాలు వెల్లుల్లిని పచ్చిగా తింటేనే పొందుతాం.

 Garlic In Your Mouth For Thirty Minutes-TeluguStop.com

వెల్లుల్లిలో శక్తివంతమైన అల్లిసిన్ అనే పదార్ధం ఉంది.అయితే వెల్లుల్లి పచ్చిగా తినకుండా కూడా వెల్లుల్లి ప్రయోజనాలను పొందవచ్చు.

అవును ఈ చిట్కా అన్ని చిట్కాల మాదిరిగా కాకూండా డిఫరెంట్ గా ఉంటుంది.మీరు క్రమం తప్పకుండా ఈ చిట్కాను 15 రోజుల పాటు పాటిస్తే పచ్చి వెల్లుల్లి తిన్నప్పుడు వచ్చే లాభాలను పొందవచ్చు

ఈ చిట్కాను ఎలా ప్రయత్నించాలో తెలుసుకుందాం.

పచ్చి వెల్లుల్లిని నోటిలో పెట్టుకొని లాలాజలం వచ్చే వరకు ఆగాలి.మరింత లాలాజలం వచ్చే వరకు నోటిలో వెల్లుల్లిని తిప్పుతూ ఉండాలి

ఈ విధంగా ప్రతి రోజు ఉదయం 30 నిమిషాల పాటు పరగడుపున చేయాలి

వెల్లుల్లిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు లాలాజలం ద్వారా శరీరంలోకి వెళతాయి

వెల్లుల్లి ఆరోగ్యదాయక లక్షణాలు మీ రక్తవ్యవస్థలోకి ప్రవేశించాక, మీ లింఫ్ వ్యవస్థ మరియు చిన్న రక్తనాళాలను శుభ్రం చేస్తాయి.

ఇంకా వెల్లుల్లి దుర్వాసనని ఇచ్చినా కూడా నోటి ఆరోగ్యానికి చాలా మంచిది

30 నిమిషాల తర్వాత మిగిలి ఉన్న లాలాజలాన్ని ఉమ్మేయండి.మీ పళ్ళు తోముకుని, కొన్ని పుదీనా ఆకులను నమిలితే నోటిలో వెల్లుల్లి వాసన పోతుంది


ఈ అలవాటు కారణంగా మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది.ఫ్లూ, రక్తహీనత, శ్వాస సమస్యలను తొలగిస్తుంది.బ్రాంఖైటిస్ కి, మూత్రాశయం మరియు కిడ్నీల సమస్యలకి బాగా పనిచేస్తుంది

వెల్లుల్లి దీర్ఘకాలికంగా ఉన్న దగ్గును తగ్గిస్తుంది మరియు కిడ్నీలో రాళ్ళను రాకుండా నివారిస్తుంది

గుర్తుంచుకోవలసిన విషయం మీకు వెల్లుల్లి అలర్జీ ఉంటే మాత్రం ఈ విధానాన్ని ఎప్పుడూ ప్రయత్నించకూడదు.

అలాగే మీకు నోటి దుర్వాసన సమస్య ఉంటే వెల్లుల్లి మరింత సమస్య పెంచవచ్చు.అందుకని, మీ వైద్యుని సంప్రదించి ఈ చిట్కాను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube