ముఖం తెల్లగా మెరిసిపోవాలనే కోరిక అందరికీ ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలు ముఖాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ ను వాడుతుంటారు.కొందరు ఏవేవో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు మీ ముఖాన్ని వారం రోజుల్లో సహజంగానే తెల్లగా మారుస్తాయి.మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటో.
వాటిని ఎలా ఉపయోగించాలో.తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు అవిసె గింజలను వేసి రెండు, మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి.ఇలా వేయించుకున్న అవిసె గింజలను మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి నుంచి పౌడర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్‌లో అర గుప్పెడు నిమ్మ తొక్కలు, ఒక కప్పు వాటర్ వేసుకుని గంట నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత వాటర్‌తో సహా నిమ్మ తొక్కలను గ్రైండ్ చేసుకుని.జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజల పౌడర్, సరిపడా నిమ్మ తొక్కల జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.
ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు గనుక చేస్తే.అవిసె గింజలు, నిమ్మ తొక్కల్లో ఉండే పలు సుగుణాలు చర్మాన్ని సహజంగానే తెల్లగా, కాంతివంతంగా మారుస్తాయి.
మురియు అవిసె గింజలు, నిమ్మ తొక్కలను ఉపయోగించి పైన చెప్పిన విధంగా చేస్తే మొండి మొటిమల, మచ్చల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.