సాధారణంగా ఒక్కోసారి మన చేతులు నల్లగా( Dark Hands ) నిర్జీవంగా మారిపోతూ ఉంటాయి.ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం తదితర కారణాల వల్ల హాండ్స్ డార్క్ గా మరి వేరుపాటుగా కనిపిస్తుంటాయి.
అటువంటి హాండ్స్ ను ఎలా రిపేర్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు.కానీ వర్రీ వద్దు.
కేవలం 20 నిమిషాల్లో మీ హాండ్స్ ను సూపర్ వైట్ గా, బ్రైట్ గా మెరిపించడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది.ఆ రెమెడీ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి, ( Sandalwood Powder ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ మరియు సరిపడా ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చేతులను ఐదు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత వాటర్ తో శుభ్రంగా చేతులను క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను చేతలకు అప్లై చేసుకోవాలి.
ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే చేతులపై పేరుకుపోయిన దుమ్ము ధూళి మృత కణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.చేతులు తెల్లగా కాంతివంతంగా మారతాయి.కాబట్టి తమ హ్యాండ్స్ డార్క్ గా అసహ్యంగా కనిపిస్తున్నాయని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.
పైగా మెడ నలుపును వదిలించడానికి, అండర్ ఆర్మ్స్ ను వైట్ గా మార్చడానికి కూడా ఈ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.